కోటక్ మ్యూచువల్ ఫండ్ ఇటీవల “చోటీ సిప్” సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌కు సంబంధిందచిన అన్ని అర్హత కలిగిన పథకాలకు చోటీ సిప్ అందుబాటులో ఉంటుంది. సెబీ, ఏఎంఎఫ్ఐ ఇటీవల చోటీ సిప్ (స్మాల్ టికెట్ సిప్) ను ప్రవేశపెట్టాయి. సంపద సృష్టి ప్రయాణంలోకి ఎక్కువ మంది భారతీయులను తీసుకురావడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశ జనాభాలో దాదాపు 5.4 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారులు మాత్రమే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వారికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఆసక్తి కలిగించడానికి ఎస్ఐపీలు ఒక అద్భుతమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోటక్ ప్రవేశపెట్టిన చోటా ఎస్ఐపీతో కేవలం రూ. 250తో వారి సంపద సృష్టి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని నిపుణులు చెబతున్నారు.
కోటక్ మ్యూచువల్ ఫండ్స్ చోటీ ఎస్ఐపీ అధిక రాబడినిచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఎక్కువ మంది ప్రజలను మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి చూడంతో ఈ మార్కెట్‌పై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. అయితే కోటక్ చోటీ ఎస్‌పీలో పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడిదారుడు గతంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండకూడదు. అలాగే పెట్టుబడిదారుడు గ్రోత్ ఆప్షన్‌లో పెట్టుబడి పెట్టడంతో పాటు కనీసం 60 వాయిదాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. వాయిదాల చెల్లింపు ఎన్ఏసీహెచ్ లేదా యూపీఐ ఆటో-పే ద్వారా మాత్రమే చేయాలి. ఈ ప్లాన్ తమకు అనుకూలంగా ఉందో? లేదో? అనే సందేహం ఉంటే పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిపుణులు, పన్ను సలహాదారులను సంప్రదించడం ఉత్తమం.
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌కు అసెట్ మేనేజర్. కేఎంఏఎంసీ డిసెంబర్ 1998లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. అలాగే డిసెంబర్ 31, 2024 నాటికి, వివిధ పథకాలలో 70.43 లక్షలకు పైగా ప్రత్యేకమైన ఫోలియోలను కలిగి ఉంది. కేఎంఎఫ్ వివిధ రకాల రిస్క్ – రిటర్న్ ప్రొఫైల్‌లతో పెట్టుబడిదారులకు సేవలు అందించే పథకాలను అందిస్తుంది. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రత్యేక గిల్ట్ పథకాన్ని ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి ఫండ్ హౌస్‌గా నిలిచింది. ఈ కంపెనీ 96 నగరాల్లో 104 శాఖలతో విస్తరించి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..