kolleru: మరోసారి పరిశీలన చేయండి.. కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 25 , 2025 | 05:18 PM

కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్. గవాయి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

kolleru: మరోసారి పరిశీలన చేయండి.. కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme

ఢిల్లీ: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్. గవాయి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై తనిఖీ జరపాలని కేంద్ర సాధికార కమిటీకి సూచించింది. కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై ప్రైవేటు మత్స్యకారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందించాలని సీఈసీకి ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ వెట్ ల్యాండ్ స్టేట్ అథారిటీ సుప్రీంకోర్టు ఆదేశాలను సరిగా అమలు చేస్తున్నారో లేదోనని నివేదిక ఇవ్వాలని చెప్పింది. కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలి, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ తీర్మానాలను, కొల్లేరు సరిహద్దులపై ఆర్ సుకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి సమస్యను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని సూచించింది.

వన్యప్రాణుల సంరక్షణ చట్టంకు అనుగుణంగా కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫై చేశారా ? కొల్లేరులో ఉన్న ప్రైవేటు భూ యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారు ? 12 వారాల్లోగా సుప్రీంకోర్టులో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది తాడిమళ్ల గౌతమ్ కేసు దాఖలు చేశారు.

Also Read:

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Andhra Pradesh: ఇచ్చిన మాట నిలబెట్టకున్న పవన్ కల్యాణ్..

Pahalgam Attack: కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపేశారు.. బాధితురాలి ఆవేదన వర్ణణాతీతం..

Updated Date – Apr 25 , 2025 | 05:19 PM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights