Kodali Nani In AIG Hospital

Written by RAJU

Published on:

  • మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత..
  • ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడుతోన్న మాజీ మంత్రి..
  • హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి..
Kodali Nani In AIG Hospital

Kodali Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్‌లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కొడాలి నాని.. అయితే, గ్యాస్ట్రిక్‌ సమస్యతో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారని చెబుతున్నారు ఏఐజీ వైద్యులు.. కాగా, గతంలో గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు కొడాలి నాని.. దీంతో, ఇప్పుడు గ్యాస్ట్రిక్‌ సమస్యయేనా..? లేక మళ్లీ గుండెకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది జరిగిందా? అనేది తేల్చేందుకు సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏఐజీ వైద్యులు.. కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న కొడాలి నాని.. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్‌ జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. అయితే, జగన్‌ కేబినెట్‌ 2.0లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.. ఇక, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కొడాలి నాని మరోసారి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినా ఓటమి పాలైన విషయం విదితమే..

Read Also: Kadapa Zilla Parishad Chairman Election: హైకోర్టుకు చేరిన కడప జిల్లా పరిషత్‌ ఎన్నిక పంచాయితీ..

Subscribe for notification