KL Rahul: పాపం.. రాహుల్! ఢిల్లీ జట్టులోనూ తప్పని అవమానం.. కెప్టెన్సీ వద్దన్నాడన్న కోపంతోనేనా?

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025 మెగా సమరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికీ అన్ని టీమ్స్‌ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. అయితే టీమిండియా ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌.. ఆ జట్టు నుంచి బయటికి వచ్చి మెగా వేలంలో పాల్గొన్నాడు. దీంతో ఢిల్లీ అతన్ని రూ.14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాహుల్‌ను అంత ధర పెట్టి తీసుకోవడం, గత సీజన్లలో వాళ్ల కెప్టెన్‌ గా ఉన్న పంత్‌ బయటికి వెళ్లిపోవడంతో ఇక డీసీకి రాహులే కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. డీసీ మేనేజ్‌మెంట్‌ కూడా రాహుల్‌కు కెప్టెన్సీ ఆఫర్‌ చేసింది. కానీ, వాళ్ల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన రాహుల్‌, బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతానని అన్నాడు.

దీంతో వేరే దారిలేక అక్షర్‌ పటేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది డీసీ మేనేజ్‌మెంట్‌. ఇక రాహుల్‌ ఓపెనర్‌గా ఏ ప్రెజర్‌ లేకుండా ఆడతాడని అంతా భావించారు. రాహుల్‌ కూడా గతంలో తన స్ట్రైక్‌రేట్‌పై వచ్చిన విమర్శలకు ఈ సారి ఐపీఎల్‌లో సమాధానం చెప్పాలని బలంగా ఫిక్స్‌ అయ్యాడు. కానీ, డీసీ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌కు ఊహించని షాకిచ్చింది. ఓపెనర్‌గా కాకుండా మిడిల్డార్లో ఆడాల్సిందిగా రాహుల్‌కు సూచించింది. యువ ఓపెనర్‌ జెక్‌ ఫ్రెజర్‌తో కలిసి ఫాఫ్‌ డుప్లెసిస్‌తో ఓపెన్‌ చేయించి, అభిషేక్‌ పొరెల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరి ముగ్గురితో టాపార్డర్‌ ఫుల్‌ అయిపోయింది. అందుకే రాహుల్‌ను మిడిల్డార్లో ఆడించాలని భావిస్తారు. అయితే హ్యారీ బ్రూక్‌ ఐపీఎల్‌కు దూరం అవ్వడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

బ్రూక్‌ ఉంటే మిడిల్డార్‌లో ఒక రైట్‌ హ్యాండ్‌ మంచి బ్యాటర్‌ ఉండేవాడు. అప్పుడు ఓపెనర్‌గా రాహుల్‌ ఆడితే, డుప్లెసిస్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు కష్టమయ్యేది. కానీ, బ్రూక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో మిడిల్డార్‌లో స్టెబిలిటీ ఇచ్చే రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్గా రాహుల్‌ను ఆడించనున్నారు. అయితే కెప్టెన్సీ ఆఫర్‌ను కాదన్నాడనే ఉద్దేశంతో రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించడం లేదా అంటే.. అలాంటిదేం లేదు. కేవలం జట్టు మిడిల్డార్‌లో పరిస్థితికి తగ్గట్లు మ్యాచ్‌ను హ్యాండిల్‌ చేసే ప్లేయర్‌గా రాహుల్‌ డీసీ మేనేజ్‌మెంట్‌ చేస్తోంది. పైగా టీమిండియాలో కూడా రాహుల్‌ డౌన్‌ ది ఆర్డర్‌ ఆడుతున్నాడు. వికెట్లు పడితే జాగ్రత్తగా ఆడగలడు, వికెట్లు చేతిలో ఉంటే అగ్రెసివ్‌గా దుమ్ములేపుతాడు. అందుకే డీసీ రాహుల్‌ను మిడిల్డార్‌లో ఆడాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Subscribe for notification