Kishan reddy mentioned whole nation is being robbed by obstructing Waqf Board

Written by RAJU

Published on:

  • దేశమంతా వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు
  • తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి చెప్పాలి
  • వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది,
Kishan reddy mentioned whole nation is being robbed by obstructing Waqf Board

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ కి బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది, తప్ప సామాన్యులకు ఉపయోగ పడడం లేదు.. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా దారుస్సలంకి వెళ్తుంది..

Also Read:Andhra to Andhra via Telangana: ఆంధ్రా to ఆంధ్రా వయా తెలంగాణ.. గళమెత్తిన కూటమిలోని మరో ఎమ్మెల్యే..!

దేశమంతా వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు.. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటి వరకు ఆడిట్ జరగలేదు.. వక్ఫ్ బోర్డు దగ్గర ఎంత భూమి ఉందో చెప్పరు.. డాక్యు మెంట్ లు వాళ్ళ నాయకుల ఇళ్ళల్లో ఉంటాయి.. కొత్త చట్టం వల్ల రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతుంది.. భూముల వివరాలు మొత్తం డిజిటలైజ్ చేస్తాం.. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంత మంది పేదలకు న్యాయం చేశారో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు చెప్పాలి” అని సవాల్ విసిరారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights