స్థల సేకరణలో చొరవ తీసుకోండి
సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ
తెలంగాణలో బీజేపీదే అధికారం
పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఉద్ఘాటన
హైదరాబాద్/న్యూఢిల్లీ/సరూర్‌నగర్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మించనున్న, నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. భూ సేకరణ ప్రక్రియపై వ్యక్తిగతంగా చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో 2,500 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో రీజినల్ రింగ్ రోడ్డు కాకుండా, 12,619 కోట్ల అంచనా వ్యయంతో 691 కి.మీ. పొడవున నిర్మించనున్న, నిర్మిస్తున్న 16 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి 1,550 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ స్థల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పలుసార్లు లేఖలు రాస్తే ఇప్పటి వరకు 904 హెక్టార్ల భూమే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసింది. ఇంకా 646 హెక్టార్ల భూమి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్థలాన్ని సేకరించి ఇస్తే ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుంటుంది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ 8 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుని అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింద న్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పా ర్టీ రాష్ట్ర కార్యాలయంలో, మహేశ్వరంలోని బడంగ్‌పేట్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సపై పదేళ్లలో ప్రజా వ్యతిరేకత వస్తే, పది నెలల్లోనే కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లి్‌స గెలుపుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడి కుట్రలు చేస్తున్నాయన్నారు.
దేశ విభజనకు విపక్షాల కుట్ర : లక్ష్మణ్
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలన్నది ప్రజల ఆకాంక్ష అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైపు ఏకపక్షంగా తీర్పు వచ్చిందని తెలిపారు. కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో విపక్షాలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.
వక్ఫ్ కొత్త చట్టంతో అక్రమాలకు చెక్: డీకే అరుణ
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడం దేశ చరిత్రలో కీలక ఘట్టమని బీజేపీ ఎంపీ, వక్ఫ్ సవరణ బిల్లు జేపీసీ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఈ బిల్లుకు శ్రీరామనవమి రోజునే చట్టబద్ధత కల్పించడం శుభతరుణమని చెప్పారు. ఆదివారం తన నివాసంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు చట్టబద్ధత రావడంతో ఇన్నాళ్లూ కొంత మంది చేసిన అక్రమాలకు ఇకపై చెక్ పడుతుందని, వక్ఫ్ పేరుతో వివాదాల్లో ఉన్న వేల ఎకరాలపై స్పష్టత రానుందని డీకే అరుణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News