Khammam: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. గంట వ్యవధిలోనే భార్య, భర్తలు మృతి! – Telugu Information | “Overwhelmed by Spouse’s Dying, Husband Succumbs to Coronary heart Assault Inside an Hour in Khammam District”

Written by RAJU

Published on:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీవెంటే నేను అంటూ ఒకరి తర్వాత ఒకరు వృద్ధ దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు బాధాటి యశోద (76), హనుమ రెడ్డి ( 81) మృతి చెందారు. భార్య యశోదపై దర్వాజ పడంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అమెను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భార్య మరణవార్త విన్న హనుమరెడ్డి షాక్‌కు గురయ్యాడు. నూరేళ్లు తోడై నడుస్తానని అగ్ని సాక్షిగా ఏడగులు వేసి తన వెంట వచ్చిన భార్య..తనను వదిలి వెళ్లిపోవడంతో హనుమరెడ్డి గుండె చలించి పోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య మరణాన్ని జీర్ణించుకోలేక పోయిన హనుమ రెడ్డి గుండెపోటుతో మరణించాడు.

గంటల వ్యవధిలోనే ఇద్దరు అన్యోన్య వృద్ధ దంపతులు మృతి చెందడంతో రామచంద్రపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్నాళ్లు పక్కనే ఉంటూ అప్యాయంగా పలకరించే వారు..తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights