Key Workshop: సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..

Written by RAJU

Published on:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ITE&C డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన కీలక సమావేశం (Key Workshop) జరుగుతోంది. centre for Government Digital Transformation పార్టనర్‌షిప్‌తో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (Artificial Intelligence (AI) and Emerging Technologies for Government Digital Transformation)పై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇది రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ వర్క్ షాప్‌కు అన్ని శాఖల నుండి అధికారులు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం.. పబ్లిక్ సర్వీస్ డెలివరినీ వేగవంతం చేసేందుకు అవసరమైన అవగాహనను స్పెషల్ చీఫ్ సెక్రటిరీలు, ప్రిన్సిఫల్ సెక్రటిరీలు, సెక్రటిరీలు, శాఖాధిపతులకు కల్పించే లక్ష్యంతో ఈ వర్కుషాపు నిర్వహిస్తున్నారు.

Also Read..: అరుదైన నక్షత్రపు తాబేలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

ఈ వర్కుషాపు ముఖ్యఉద్దేశ్యం..

AI, ML (మిషన్ లెర్నింగ్) ఇంకా పాలనకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉన్నతాధికారులు అర్థం చేసుకోడం, వివిధ ప్రభుత్వ రంగాలలో ఉపయోగించే పలు రకాల AI అప్లికేషన్‌లను గుర్తించడం.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో జనరేటివ్ AIపై అంతర్ దృష్టిని సారించడం.. పాలసీ అంతర్‌దృష్టి కోసం విశ్లేషణలను ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం గురించి తెలుసుకోవడం తదితర అంశాలపై ఈ వర్క్ షాపు నిర్వహిస్తున్నారు.

నిర్మాణాత్మక ఆలోచనలకు అనుగుణంగా AI-డ్రైవెన్ గవర్నెన్స్ ప్రాజెక్టులను అభివృద్ది చేయడం ఇంకా పైలట్ ప్రాజక్టులను అమలు చేసే దిశాగా చర్యలు తీసుకోవడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించే వాద్వానీ ఫౌడేంషన్ సహకారంతో నిర్వహించే ఈ వర్కుషాపుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ తొలి ఐటి కార్యదర్శి, MEITY & DoT మాజీ సెక్రటరీ ఆర్.చంద్రశేఖర్, DGP హరీష్ కుమార్ గుప్తా, ITE&C Dept. సెక్రటరీ కాటమనేని భాస్కర్ తదితరులు ఈ వర్క్ షాపుకు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం..

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికాకులకు మార్గనిర్దేశం చేశారు. వర్క్‌షాప్‌కు వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్‌తో సహా పలువురు నిపుణులు వస్తారని చెప్పారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలన చేయాలని సూచించారు. ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై ప్రజంటేషన్ ఇస్తామన్నారు. ఏఐ, ఎంఎల్, డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తామన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరిస్తారన్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌లో మొదటిరోజు కార్యదర్శులు హాజరవుతారని, రెండోరోజు (శుక్రవారం) విభాగాధిపతులు హాజరవుతారని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..

మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి..

For More AP News and Telugu News

Updated Date – Apr 24 , 2025 | 12:26 PM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights