Key progress in SLBC tunnel operation.

Written by RAJU

Published on:

  • ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక పురోగతి
  • టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు
  • కుడి చేయి, ఎడమ కాలు భాగాలను గుర్తించిన రెస్క్యూ బృందాలు
  • సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం.
Key progress in SLBC tunnel operation.

ఎస్ఎల్‌బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 16వ రోజు కొనసాగుతుంది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, టీబీఎం మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు.. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆ ప్రదేశంలో కట్టర్లతో కట్ చేస్తూ.. 8 అడుగుల మేర తవ్వకాలు జరుపుతున్నారు. చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్థారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉంది.

Read Also: Champions Trophy Final: న్యూజిలాండ్తో ఫైనల్‌ ఫైట్.. కివీస్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న రోహిత్..?

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.

SLBC టన్నెల్ లో బాడీని గుర్తించిన సిబ్బంది | Special Report Drom SLBC Tunnel | Ntv

Read Also: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు

Subscribe for notification