కేరళ రాష్ట్రం కాసరగోడ్‌లోని విద్యా నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి పనసకాయను కోస్తుండగా.. పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లిన 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కత్తి మీద పడి తీవ్ర రక్తశ్రావం కావడంతో మరణించాడు. ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం. పనసకాయలు కోస్తున్న తన తల్లి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ కత్తి మీద పడి ఎనిమిదేళ్ల బాలుడు మరణించిన ఘటన కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లాలోని విద్యా నగర్‌లో చోటుచేసుకుంది. అయితే సాధారణంగా కాసరగోడ్ ప్రాంతంలో, పనసపండ్లను కోయడానికి ఒక పలకకు అమర్చిన ప్రత్యేక రకం కత్తిని ఉపయోగిస్తారట. అయితే బెల్లురదుక్కకు చెందిన ఓ మహిళ ఇంట్లో పనసకాయ కోస్తుండగా.. తన ఎనిమిదేళ్ల కుర్రాడు హుస్సేన్ షాబాజ్ పరిగెత్తుకుంటూ తల్లి వద్దకు వచ్చాడు. తల్లి దగ్గరకు రాగానే ప్రమాదవశాత్తు అక్కడున్న సనసకాయలు కోసే కత్తిపై పడిపోయాడు. దీంతో కత్తి హుస్సేన్‌కు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో హుస్సేన్ ఛాతీ ఎడమ వైపు లోతైన గాయం అయింది.
అప్రమత్తమైన తల్లి వెంటనే హుస్సేన్‌ను కాసరగోడ్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అక్కడ హుస్సేన్ పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ వార్త విన్న తల్లి తట్టుకోలేక పోయింది. కళ్ల ముందే కన్న కొడుకు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా రోధించింది. కాగా బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…