- ఢిల్లీ కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ..
- కాలుష్యం ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం దాదాపు 10 ఏళ్లు తగ్గుతుంది..
- ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే జబ్బు రావడం ఖాయం: కేంద్రమంత్రి గడ్కరీ

Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్‌జోన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయుర్దాయం దాదాపు 10 ఏళ్లు తగ్గుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సి ఉందని ఆయన సూచించారు. అలాగే, రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నామో.. పర్యావరణాన్ని కూడా అలాగే, రక్షిస్తామన్నారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కూడా ఓ పరిష్కారంగా పని చేస్తుందని నితీన్ గడ్కరీ వెల్లడించారు.
Read Also: Calcutta: హైకోర్టు సంచలన తీర్పు.. వివాహితులిద్దరూ శారీరిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదు
అయితే, పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు కాబట్టి వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. మనం దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాం.. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యంతో వెళ్తున్నాం.. భారత్ రవాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాలలో ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేకంగా నజర్ పెట్టిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే.. మన ఖర్చులు 16 శాతంగా ఉన్నాయి.. 2026 చివరి నాటికి వాటిని సింగిల్ డిజిట్‌కు తగ్గించడానికి ప్రయత్నిస్తామని నితీన్ గడ్కరీ పేర్కొన్నారు.