Kedarnath Yatra: కేదార్‌నాథ్ హెలికాప్టర్ సర్వీస్ బుకింగ్ 5 ని. పూర్తి, చార్‌ధామ్ యాత్ర ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే

Written by RAJU

Published on:

Kedarnath Yatra: కేదార్‌నాథ్ హెలికాప్టర్ సర్వీస్ బుకింగ్ 5 ని. పూర్తి, చార్‌ధామ్ యాత్ర ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే

కేదార్​నాథ్ వెళ్లేందుకు గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా చేరుకోవాల్సి ఉంటుంది. హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం 2023లో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హెలికాప్టర్‌ సర్వీసులను ప్రారంభించింది. దీంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది వినియోగించుకుంటున్నారు.

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న తెరవనున్నారు. అయితే ఈ యాత్ర చేసే భక్తుల ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే కేదార్​నాథ్ వెళ్లేందుకు గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. అక్కడ నుంచి భక్తులు మరో 18 కి.మీ యాత్ర చేయాల్సి ఉంటుది. ఇది అతి కష్టమైన యాత్ర. అయినప్పటికీ ఈ యాత్రను చేయడానికి పిల్లలు, వృద్ధులు, ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపధ్యంలో అటువంటి భక్తుల ప్రయాణాన్ని సౌకర్యవంతం చేయడనికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది భక్తులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.

మంగళవారం ఈ ఏడాది కేదార్నాథ్ కు వెళ్లేందుకు హెలికాప్టర్ బుకింగ్ సేవ ప్రారంభమైంది. భక్తులను దర్శనం కోసం హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్‌కు వెళ్తారు. అయితే ఈ హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ ప్రారంభమైన వెంటనే.. కేవలం ఐదు నిమిషాల్లోనే 35 వేల టిక్కెట్లు బుక్ అయ్యాయి.

ఉత్తరాఖండ్‌లోని పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం తొలిసారిగా హెలికాప్టర్ టికెట్ బుకింగ్ బాధ్యతను IRCTCకి అప్పగించింది. ఇప్పటివరకు, టికెట్లను హెలికాప్టర్ కంపెనీల నుంచి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ ప్రారంభమైంది. 12:05 గంటలకు ‘నో రూమ్’ స్క్రీన్‌పై కనిపించడం ప్రారంభమైంది. అంటే 5 నిమిషాల్లోనే అన్ని టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇలా మొదటిసారి జరిగిందని చెబుతున్నారు.

టికెట్ బుకింగ్ పారదర్శకంగా జరిగేలా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ టికెట్ బుకింగ్ బాధ్యతను IRCTCకి అప్పగించింది. అయితే ఇప్పుడు టిక్కెట్ల బుకింగ్ చాలా వేగంగా పూర్తయిన తర్వాత, సామాన్య ప్రజలలో అసంతృప్తి కనిపిస్తుంది. పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ గంగ్వార్ మాట్లాడుతూ టిక్కెట్ల బుకింగ్ చూసి మేము కూడా ఆశ్చర్యపోయాము, టిక్కెట్లు ఇంత త్వరగా ఎలా బుక్ అయ్యాయో అని అన్నారు.

చార్జీ ఎంత అంటే

ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్రను చేసేందుకు భక్తులు మరింత ఉత్సాహంగా ఉన్నారని కూడా ఆయన అన్నారు. గుప్త కాశి నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ ఛార్జీ రూ. 8,532 కాగా, ఫాటా నుంచి రూ. 6062, సిస్సో నుంచి ప్రయాణీకుడికి రూ. 6060లు. ఈసారి ప్రయాణీకుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు. అంటే ఈ ఏడాది ఒకే రోజులో ఎంత మంది భక్తులు కావాలంటే అంత మంది దర్శనం చేసుకోవచ్చు.

యాత్రకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం

  1. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది.
  2. మే 2న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరవనున్నారు.
  3. ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం నుంచి హెలికాప్టర్ బుకింగ్ ప్రారంభం
  4. మే నెలకు 38 వేల టిక్కెట్లు కేవలం ఐదు నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.
  5. సర్సీ హెలిప్యాడ్‌, ఫటా, గుప్తకాశీ మూడు వేర్వేరు ల్యాండింగ్ ప్యాడ్‌ల నుంచి హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు వెళ్ళవచ్చు.
  6. గుప్త్ కాశి నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణ ఛార్జీ: రూ. 8,532
  7. ఫాటా నుంచి కేదార్‌నాథ్‌కు ఛార్జీ 6062
  8. సిస్సో నుంచి కేదార్‌నాథ్‌కు ధర 6060

ఇప్పటివరకు లక్షల మంది ప్రయాణికులు నమోదు చేసుకున్నారు

మార్చి 20 నుండి చార్‌ధామ్ యాత్ర కోసం ఇప్పటివరకు 13.53 లక్షల మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 28 నుంచి ప్రయాణీకులు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 60 కౌంటర్లు ఉంటాయి. ఈ కౌంటర్లు మొదటి 15 రోజులు 24 గంటలు సేవలను అందిస్తాయి. 2024 సంవత్సరంలో 45 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

కేదార్​నాథ్, బద్రీనాథ్ ఆలయం ఎప్పుడు తెరచుకుంటాయంటే

చార్​ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి ఆలయాలతో పాటు, కేదార్​నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకోవడం. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ రోజున అంటే ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. మే 2 ఉదయం 7గంటలకు కేదార్​నాథ్ ఆలయం తెరవనుండగా.. మే 4న బద్రీనాథ్ ఆలయాన్నితెరవనున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights