KCR’s Key Feedback at Siddipet Assembly: BRS to Regain Energy in Telangana

Written by RAJU

Published on:

  • రాబోయే రోజుల్లో అధికారం BRS దే
  • సింగిల్ గా అధికారంలో వస్తాం
  • బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి
  • అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణాని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు : కేసీఆర్‌
KCR’s Key Feedback at Siddipet Assembly: BRS to Regain Energy in Telangana

KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, భవిష్యత్తులో BRS అధికారంలోకి రావడంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “సింగిల్‌గా అధికారంలోకి వచ్చేది మేమే, బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అదే విధంగా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పథంలో సాగిందని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. “తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. అభివృద్ధికి బ్రేకులు వేయడం ప్రారంభమైంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం పోరాడినది, పోరాడేదీ BRS ఒక్కటేనని స్పష్టం చేశారు. “నాడు ప్రధాని మోదీ నా మెడపై కత్తి పెట్టినా కూడా నేను వెనక్కి తగ్గలేదు. తెలంగాణ కోసం ఎప్పుడు అయినా పోరాడేది మనమే” అని గుర్తు చేశారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ, “ఆయన ఓ సన్నాసి. అలాంటి వాళ్ల చేతుల్లో ప్రజలు తవ్విపెట్టుకుంటున్నారు” అని విమర్శించారు.

కేసీఆర్ తన ప్రసంగంలో గత రాజకీయాలను ప్రస్తావిస్తూ, “ఐదేళ్ల క్రితం ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది” అని చెప్పారు. అలాగే, “ఆంధ్రాలో మనలను బలవంతంగా కలిపారు. ఇదే నిజం” అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలందరూ ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉండాలని, తెలంగాణ హక్కుల కోసం ప్రతి ఒక్కరు కేసీఆర్‌లా మారాలని సూచించారు. “ఈ నేలపై ఎవ్వరూ శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరూ ఉద్యమకారులుగా మారాలి” అని పిలుపునిచ్చారు.

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేక పోయింది” అని మండిపడ్డారు. BRS ప్రభుత్వం హయాంలో అమలు చేసిన పథకాల గురించి మాట్లాడుతూ, “మేము మేనిఫెస్టోలో పెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు రైతుల కోసం గొప్పవిగా నిలిచాయి. ఇవి మన ప్రభుత్వ విజయాన్ని సూచించే నిదర్శనాలు” అని తెలిపారు.

Jagapatibabu : మేకప్ ఆర్టిస్టుగా మారిపోయిన అగ్రనటుడు.. కారణం అదే

Subscribe for notification