సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్‌దేనని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ధీమా వ్యక్తం చేశారు. సింగిల్‌గా అధికారంలో వస్తామని ఉద్ఘాటించారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని.. అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. గోదావరి కన్నీటి గోస పేరిట గోదావరిఖని నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెలే కోరుకంటి చందర్ మహా పాదయాత్ర చేపట్టారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ఇవాళ(శనివారం)కోరుకంటి చందర్ మహా పాదయాత్ర ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
పాదయాత్ర చేసి వచ్చిన వారితో కేసీఆర్ సమావేశమయ్యారు .ఈ సందర్భంగా కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. పదేళ్లు తమ హయాంలో తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని చెప్పారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణకు ఆనాడు దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఏపీలో కూటమి లేకుంటే సీఎం చంద్రబాబు గెలిచేవారు కాదని చెప్పారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపారని మండిపడ్డారు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదని చెప్పారు. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని ఉద్ఘాటించారు. తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ నేతలు పోరాడాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో పెట్టకపోయిన రైతుబంధు, కల్యాణ లక్ష్మీ పథకాలను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని కేసీఆర్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News