ఏపీలో కూటమి లేకుంటే సీఎం చంద్రబాబు గెలిచేవారు కాదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపారని కేసీఆర్ అన్నారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదన్న ఆయన.. అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టకపోయిన రైతుబంధు, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వదేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.