Kawasaki Versys 650: 2025 Mannequin Launched in India with BS6 P2 Compliance and Trendy New Look

Written by RAJU

Published on:

  • కొత్త లుక్, ప్రమాణాలతో అదరగొట్టిన కవాసకి వెర్సిస్ 650.
  • BS6 P2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కొత్త మోడల్
  • కొత్త వెర్షన్ ధర రూ. 7.93 లక్షలు (ఎక్స్‌షోరూమ్),
Kawasaki Versys 650: 2025 Mannequin Launched in India with BS6 P2 Compliance and Trendy New Look

Kawasaki Versys 650: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన పాపులర్ అడ్వెంచర్ టూరింగ్ బైక్ వెర్సిస్ 650 (Versys 650) 2025 సంవత్సరం మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో భారత ప్రభుత్వ రూల్స్ లో భాగంగా నూతనంగా అమలు చేస్తున్న BS6 P2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రమాణాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

Read Also: Nabha Natesh : వాళ్లను క్షమించకూడదు.. పహల్గాం దాడిపై నభానటేష్..

ఈ కొత్త వెర్షన్ ధర రూ. 7.93 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించబడింది. ఇది మునుపటి మోడల్ కన్నా రూ. 16,000 అధికం. గత సంవత్సరం మోడల్ అయిన MY24 వెర్షన్ కు రూ. 20,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ వెర్షన్ కవాసకి అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించబడింది. అయితే, కొన్ని డీలర్‌షిప్‌ల వద్ద మిగిలిన స్టాక్ లభ్యమయ్యే అవకాశం లేకపోలేదు.

2025 వెర్సిస్ 650 మోడల్‌లో “మెటాలిక్ మ్యాట్ గ్రాఫిన్‌స్టీల్ గ్రే” అనే కొత్త కలర్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. గత మోడళ్లలో ఉన్న మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ డార్క్ గ్రే కలర్‌లకు భిన్నంగా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రీన్ హైలైట్స్‌తో కూడిన గ్రే, బ్లాక్ కలర్‌ మిశ్రమం బైక్‌కు స్పోర్టీ లుక్‌ను తీసుకవచ్చింది. ఇందులో 649cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 66 bhp పవర్, 61 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో కూడిన ఈ బైక్‌లో స్లిప్ అండ్ అసిస్టు క్లచ్ ఉంటుంది. ఇది స్మూత్ రైడింగ్‌కు సహాయపడుతుంది.

Read Also: Shubhanshu Shukla: మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

ఈ మోడల్‌లో సెమి ఫెయిర్డ్ డిజైన్, ట్విన్ LED హెడ్‌లైట్స్, తక్కువగా ఉండే ఎగ్జాస్ట్, ఇంకా టాల్ విండ్స్ స్క్రీన్ ఉన్నాయి. ఈ స్ప్లిట్ సీట్ డిజైన్ రైడర్, పిలియన్‌కు ఎక్కువ కంఫర్ట్‌ను అందిస్తుంది. USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ పూర్తిగా కాంప్రెషన్, రిబౌండ్‌కు అనుగుణంగా అడ్జస్ట్ చేయవచ్చు. రియర్‌లో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంటుంది. డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, సింగిల్ రియర్ డిస్క్, 17-ఇంచ్ వీల్స్ బైక్‌కి అన్ని రకాల రోడ్లపై స్థిరతను కలిగిస్తాయి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights