- మరోసారి వివాదంలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర..
- బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో లైంగిక దాడులు సహజం..
- మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్న విపక్షలు..

Karnataka Minister: కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన బెంగళూరు లాంటి పెద్ద నగరంలో వీధిలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు గురి కావడం తరచుగా జరుగుతాయని పేర్కొన్నారు. అయితే, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నేను ప్రతిరోజు పోలీసులకు చెబుతునే ఉంటా.. ఇటీవల జరిగిన ఓ ఘటనపై నేటి ఉదయం కమిషనర్‌తో చర్చించాను.. ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టి వాటి మీదకి మళ్లుతుందన్నారు. కానీ, పోలీసులు 24X7 పని చేస్తున్నారు.. కాగా, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, మంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యాలపై బీజేపీ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు.
Read Also: Tollywood : ఒకప్పటి బాలీవుడ్ హీరోస్.. ఇప్పుడు టాలీవుడ్ విలన్స్
అయితే, ఏప్రిల్ 3వ తేదీన తెల్లవారుజామున సుద్ధగుంటేపాల్యలోని భారతి లేఅవుట్‌లోని ఒక వీధిలో నడుస్తున్న ఇద్దరు మహిళల దగ్గరకు వెళ్లిన వ్యక్తి.. వారిలో ఓ మహిళ పట్ల తాకిన తర్వాత అక్కడి నుంచి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. కానీ, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా.. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో బెంగళూరు పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించి.. సెక్షన్ 354B కింద కేసు నమోదు చేశారు.
Read Also: Road Accident: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి.. సీఎం, మంత్రుల సంతాపం..
ఇక, గత ఏడాది ఆగస్టులో కూడా ఇలాంటి సంఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. బెంగళూరులోని కోననకుంటే ప్రాంతంలో ఒక మహిళ ఉదయం వాకింగ్ కి వెళుతుండగా ఆమెను ఓ వ్యక్తి గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టాడు. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత క్యాబ్ డ్రైవర్ అయిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత సంవత్సరం ప్రభుత్వ డేటా ప్రకారం.. 2023లో బెంగళూరులో మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయని తేలింది. ఇక, పోలీసులు 3,260 కేసులు నమోదు చేయగా.. అందులో 1,135 లైంగిక వేధింపులకు సంబంధించినవి ఉన్నాయి.