Kalady Sri Adi Shankara Madom: మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం – Telugu Information | Ugadi Panchangam Shravan at Kalady Sri Adi Shankara Madom on March 30

Written by RAJU

Published on:

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి.

ఈ నేపథ్యంలో మార్చి 30న స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఉదయం 10.30 గంటలకు పంచాంగ శ్రావణం ఉంటుందని మహా సంస్థానం తెలిపింది. అలాగే ఉగాది పచ్చడి వితరణ ఉంటుందని పేర్కొంది. ఈ కార్యక్రమానికి అందరు హాజరు కావాలని కోరింది.

Kalady Sri Adi Shankara Madom

ఇదిలా ఉండగా, శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీ శంకర జయంతి వేడుకల్లో భాగంగా 23/03/2025 నుంచి 03/05/2025 మధ్య సభ్యులుగా చేరినవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం పేర్కొంది

జీవితాకాలం సభ్యత్వం రూ.5000లుగా నిర్ణయించగా, ఏడాది సభ్వత్వం రూ.1000 గా నిర్ణయించింది. ఈ సభ్యత్వం తీసుకుంటే.. భక్తులకు శాశ్వత పూజతో పాటు.. ప్రత్యేక పూజలు, ఉచిత సేవలు, ప్రత్యేక దర్శనాలు.. సేవాదళ్ కమిటీ సభ్యులుగా అవకాశం, టికెట్లపై ప్రత్యేక దర్శనం తోపాటు.. పలు రకాలను సేవలను అందించనున్నట్లు పేర్కొంది.

Subscribe for notification
Verified by MonsterInsights