- వారిపై కేసులు పెట్టడం మంచి పరిణామం
- కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటి?
- వీరి వల్ల అమాయకులు బలవుతున్నారు
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు

బెట్టింగ్ యాప్స్ వివాదంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్ల మీద కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.. వీళ్ళ ప్రమోషన్ కారణంగా అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు.. మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని.. మీరు సంపాదించుకున్న
సంపాదనను కనీసం చారిటీల ద్వారా ఖర్చు చేయాల్సిందన్నారు. మీకు ఎందుకు ఇంత కక్కుర్తి అని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసి ఇబ్బందుల్లో పడకండని యువతకు సూచించారు..
READ MORE: Yogi Adiyanath: ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహమే.. ఔరంగజేబు వివాదంపై యోగి వార్నింగ్..
వాస్తవానికి.. తెలంగాణాలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలపై ఉచ్చుబిగుస్తోంది. చిన్న వాళ్ల నుంచి పెద్ద సెలబ్రెటీల వరకు అందరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై సజ్జనార్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. “బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్లు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమజాహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి.” అని ఆయన సూచించారు.