రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా అరుదైన ఘనతను అందుకున్నాడు. అతను హీరోగా నటించిన “క” సినిమా ఇటీవలే మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత దక్కింది. ఈ ‘క’ సినిమా ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’(Dada saheb phalke film festival)కు నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖారున జరుగనున్న వేడుకల్లో విజేతలకు పురస్కారాలు అందించనున్నారు. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి తన సినిమా నామినేట్ అవ్వడంతో హీరోకి పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు.
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డు భారత సినిమా పితామహుడిగా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద స్థాపించబడింది. 1969లో భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.
ఇక మూవీ విషయానికి వస్తే..
చిన్న సినిమాగా వచ్చిన ఈ “క” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్ లుగా నటించారు. సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల దర్శకత్వం వహించారు. చింత గోపాలకృష్ణారెడ్డి సినిమాను నిర్మించగా సామ్ పీ.ఎస్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 1970ల నేపథ్యంలో సాగే పీరియడ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…