విజయవాడ, ఏప్రిల్ 11: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ (Former Minister Jogi Ramesh) సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సీఐడీ అధికారుల ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పానని తెలిపారు. ‘నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద నిరసన కోసమే వెళ్ళాను.. నేను దాడి చేయలేదు నా కారు అద్దాలు పగలకొట్టి మా వాళ్ళపై టీడీపీ నేతలు దాడి చేశారు. మేము ఎవరిపై దాడి చేయలేదు నిరసన తెలపడం కోసమే వెళ్ళాము. సీఐడీ నోటీసులతో బయటపెట్టాలని చూస్తున్నారు నేను ఎవరికి భయపడను’ అని స్పష్టం చేశారు.
వైఎస్సార్ శిష్యుడిని తాను నిక్కర్లు వేసిన నాటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. 10 నెలల కాలంలో అట్టడుగు స్థానానికి టీడీపీ వెళ్ళిందని విమర్శించారు. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తే ఇదంతా తాత్కాలికం అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయన్నారు. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారని.. దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. పీఠంపై కొడుకు ఎక్కాలా దత్త పుత్రుడు ఎక్కాలా అనేది రాష్ట్రంలో నడుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.
Woman Suicide Attempt: సహజీవనం చేసి పట్టించుకోలేదంటూ ఓ మహిళ దారుణం
ఇవన్నీ ఎప్పటి కేసులు ఎప్పుడూ నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించారు. తమను ఏమి చేయలేరని మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ ఎంత కాలం పట్టుకొని తిరుగుతావ్ ఏదో ఒకరోజు దానిని మడత పెట్టుకోవాల్సిందే అని అన్నారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది ఎల్లకాలం ఒకేలా ఉండదన్నారు. ఒకటి లేదా రెండేళ్లు రెడ్ బుక్ పట్టుకుంటారని.. 5 ఏళ్లు పట్టుకొని తిరుగుతారా అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగిసిన పతాకంలా వైసీపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
కాగా… వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడ్డారు. ఈ కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని.. విచారణ చేయాల్సిందిగా సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలో జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు ఈరోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ సుప్రీం కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాతే సీఐడీ విచారనకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
BRS Warangal Meeting: వరంగల్ బీఆర్‌ఎస్ సభపై హైకోర్టు ఏం తేల్చిందంటే
Read Latest AP News And Telugu News
Updated Date – Apr 11 , 2025 | 02:42 PM