దేశంలో హెల్త్ కేర్ రంగంలో నియామకాలు ఊపందుకున్నాయి. 2025 మార్చి నాటికి ఈ రంగం 62 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని సోమవారం (ఏప్రిల్ 7) తాజా నివేదిక వెల్లడించింది. సాంకేతిక పురోగతి, వైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. సాంకేతికత, ప్రతిభ పరివర్తనాత్మక మార్పుకు దారితీస్తున్న కొత్త యుగంలోకి భారత్ హెల్త్ కేర్ సెక్టార్ ప్రవేశిస్తోందని వెల్లడించింది. foundit.in ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ జాబ్ పోస్టింగ్ నెలవారీ ఫౌండైట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ (ఫిట్) డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
తాజా నివేదిక ప్రకారం.. AI, డిజిటల్ హెల్త్, ఇన్ఫర్మేటిక్స్ సాంకేతికతలు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హెల్త్‌టెక్ స్టార్టప్‌లు, టెలిమెడిసిన్ ప్లాట్‌ఫామ్‌లు ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. ఈ రంగంలో 8 వేలకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయి. హెల్త్‌కేర్ డిజిటల్ సొల్యూషన్‌ల స్వీ్కరణ ప్రస్తుతం ఇంకా కొనసాగిస్తున్నందున ఉత్పత్తి నిర్వహణ, క్లినికల్ సహాయం, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రోల్స్ కీలకంగా మారాయి. ఇది డిజిటలైజేషన్, రోగి-కేంద్రీకృత సంరక్షణ వైపు ఈ రంగం పురోగతిని ప్రతిబింబిస్తుందని, వివిధ విభాగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని ఫౌండేషన్ సీఈఓ వి సురేష్ అన్నారు.
ఈ రంగం పరివర్తన చెందుతున్నందున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్‌లో అధిక డిమాండ్ కనిపిస్తుంది. పెరుగుతున్న ట్రెండ్ మరింత సాంకేతికత ఆధారిత ఆరోగ్య సంరక్షణ మార్పును హైలైట్ చేస్తుంది. ఇందుకు నిపుణులకు క్లినికల్ నైపుణ్యం మాత్రమే కాకుండా సాంకేతిక, క్రాస్-ఫంక్షనల్ నైపుణ్యాలను కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి సాంకేతికత ఆధారిత కోర్సులు ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో నియామకాలు గణనీయమైన పెరుగుదలను చూపిస్తున్నాయి. దాదాపు 7.5 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ఈ రంగంల్లో సృష్టించడ్డాయి. మార్చి 2024 తో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి ఇది 62 శాతం పెరుగుదలను సూచిస్తుంది. AI/ML ఇంజనీర్లు, డేటా విశ్లేషకులు, UX/UI డిజైనర్లు, ఉత్పత్తి నిర్వాహకులు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నిపుణుల డిమాండ్ గణనీయంగా పెరిగింది. AI/ML ఇంజనీర్ల నియామకాలే గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగాయి. అలాగే డేటా విశ్లేషకులు, ఆరోగ్య సమాచార నిపుణుల డిమాండ్ ఏకంగా 41 శాతం పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇక హెల్త్ కేర్ సెక్టార్‌లోని కార్మిక శక్తిలో మహిళా ప్రాతినిధ్యం 38 శాతం ఉంది. అయితే లీడర్‌షిప్ రోల్స్‌లో మాత్రం పురుషుల ఆధిక్యం కొనసాగుతుంది. ఈ పదవులలో మహిళలు కేవలం 4 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.