Jeevan Reddy Denies Defection Rumors, Asserts Seniority in Congress

Written by RAJU

Published on:

  • “పార్టీ మారే ప్రసక్తే లేదు” – ఊహగానాలకు బ్రేక్ వేసిన జీవన్ రెడ్డి
  • “నా సీనియారిటీకి గౌరవం లేదు, కానీ కాంగ్రెస్‌నే వదలను” – అసంతృప్తి వెలిబుచ్చిన జీవన్
  • “చివరి 40 ఏళ్ళుగా నేను అంటే కాంగ్రెస్” – తన పాత్రను గుర్తుచేసిన జీవన్ రెడ్డి
Jeevan Reddy Denies Defection Rumors, Asserts Seniority in Congress

Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతారన్న ఊహగానాలను కొట్టి పడేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి… వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీని వీడనని ఆయన తెలిపారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు కాబట్టి అసంతృప్తితోనే ఉన్నానని, 2014లో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేనొక్కడినే శాసనసభ్యుడిని అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ అంటే నేను.. నేను అంటే కాంగ్రెస్ గా పార్టీ ని బలోపేతం చేశా అని ఆయన వెల్లడించారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ నిరంకుశ ప్రజాస్వామ్య పాలన లో నేను ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా ఒంటరిగా పోరాడానని, పార్టీ ఆలోచన మేరకు రెండుసార్లు కేసీఆర్ పై పోటీ చేశానన్నారు. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు లు మంత్రి పదవులు ఆశించడం లో తప్పు లేదన్నారు జీవన్‌ రెడ్డి.

Rekha Gupta: స్కూల్ ఫీజుల పెంపుపై సీఎం ఆగ్రహం.. అవసరమైతే స్కూళ్లు రద్దు చేస్తామని వార్నింగ్

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights