జీలకర్రలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ముఖ్యమైనది.
జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీలకర్ర నీటిలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా మారుతుంది. ఈ నీటిని తాగితే డీహైడ్రేషన్ సమస్య దరి చేరదు. అంతే కాదు, ఇది మెటబాలిజం రేటును కూడా రెట్టింపు ఇస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గించి, ఒబేసిటీ రాకుండా నివారిస్తుంది.
జీలకర్ర నీటిని తాగడం వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇందులోని ఫాలీఫినాల్స్ ఆందోళనను తగ్గిస్తాయి.
నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ బయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుతాయి. జీలకర్ర నీటిని తాగితే చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల ఒత్తైన కురులను పొందవచ్చు. జీలకర్ర నీటిని తాగితే జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.
ఒక గ్లాసు జీలకర్ర నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగితే గుండెలో మంట సమస్య కూడా తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగితే పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి అదుపులో ఉంటుంది. జీలకర్ర నీటిని తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె సమస్యలు రావు.