నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1 (JEE మెయిన్) పేపర్ 2 (B.Arch/B.Planning) ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 23, 2025న) విడుదల చేసింది. JEE మెయిన్ 2025 పేపర్ 2 రిజల్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో చెక్ చేసుకోవచ్చు. JEE మెయిన్ 2025 సెషన్ 1 పేపర్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి స్కోర్‌కార్డ్ తనిఖీ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి JEE మెయిన్ 2025 సెషన్ 1 పేపర్ 2 స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో JEE మెయిన్ 2025 అప్లికేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
వీరే టాపర్స్
పేపర్ 2ఏ (B.Arch) కోసం దరఖాస్తు చేసుకున్న 63,481 మంది అభ్యర్థుల్లో 44,144 మంది పరీక్షకు హాజరు కాగా, పేపర్ 2బీ (B.Planning) కోసం నమోదు చేసుకున్న 28,335 మంది విద్యార్థుల్లో 18596 మంది హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన పటేల్ నీల్ సందేశ్ BArch పరీక్షలో 100 పర్సంటైల్ సాధించగా, సునిధి సింగ్ BPlanning పరీక్షలో ఫుల్ మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. BArch, BPlanning ప్రోగ్రామ్‌ల కోసం JEE మెయిన్ 2025 పేపర్ 2 జనవరి సెషన్ జనవరి 30న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 వరకు ఒకే షిఫ్ట్‌లో జరిగింది. ఫిబ్రవరి 16 వరకు ప్రొవిజనల్ ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
పేపర్ 2A (B.Arch)లో రాష్ట్రాల వారీగా టాపర్లు
1. పట్నే నీల్ సందీప్ – మహారాష్ట్ర
2. ఆరవ్ గార్గ్ – ఉత్తర్ ప్రదేశ్
3. తనిష్క యాదవ్- ఛండీగఢ్
4. సునిధి సింగ్ – మధ్యప్రదేశ్
5. డిఫెన్స్ దినేష్ హెగ్డే – కర్ణాటక
6. ఇషాన్ శివకుమార్- హర్యానా
7. జీ అదితి- తమిళనాడు
8. సాకేత్ వేంపల్లి- తెలంగాణ
9. స్వస్తి సింఘాల్- ఢిల్లీ (NCT)
10. అన్షి మిశ్రీ – గుజరాత్
పేపర్ 2B (BPlanning)లో రాష్ట్రాల వారీగా టాపర్లు
1. సునిధి సింగ్- మధ్యప్రదేశ్
2. ధ్రువ్ రాహుల్ పాఠక్ – కర్ణాటక
3. కళా సాయి సృజన – ఆంధ్రప్రదేశ్
4. అనిష్ దేబ్ – అసోం
5. ప్రితీష్ నంది- పశ్చిమ బెంగాల్
6. వరద వినాయక్ అంతర్కర్- మహారాష్ట్ర
7. ఆదిత్య నాయక్ – ఒడిశా
8. ప్రతీక్ రాజ్- బీహార్
9. స్వస్తి సింఘాల్ – ఢిల్లీ (NCT)
10. జ్యోతిరాదిత్య చౌదరి- రాజస్థాన్
ఇవి కూడా చదవండి:
Viral Video: ప్రధాని మోదీ, ట్రంప్‌ని మెచ్చుకున్న మహిళా ప్రధాని.. వారిపై విమర్శలు..
Upcoming IPOs: పెట్టుబడిదారులకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News