- సినీ నటులుకు ఉండే క్రేజ్, ప్రధాని నరేంద్రమోడీకి సొంతం..
- ఎంపీ జయా బచ్చన్ ప్రశంసలు..

Jaya Bachchan: ప్రముఖ బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. నిత్యం బీజేపీ, బీజేపీ నాయకులను సభలో విమర్శించే జయాబచ్చన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 2004 నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న జయా.. ఇటీవల ఒక డిబేట్‌లో రాజకీయాల్లోకి సినీ యాక్టర్స్ ప్రవేశం గురించి, వారి ప్రజాదరణ గురించి మాట్లాడారు. ప్రజాదరణ రాజకీయ పార్టీలకు ఎలా ప్రయోజనకరంగా మారుతుందో వెల్లడించారు. రాజకీయాల్లో సినీ నటులకు ఉండే క్రేజ్ ఎవరికి ఉందని ప్రశ్నించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి తప్పా వేరే వారెవరికి అంత క్రేజ్ లేదని ఆమె చెప్పారు.
Read Also: RSS: ఔరంగజేబు సమాధి, నాగ్‌పూర్ హింస.. ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు..
‘‘నటులకు కూడా ఆకాంక్షలు ఉంటాయి. బహుశా నటుడిగా విజయం సాధించిన తర్వాత, వారు ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. మీరు ఒక తెలిసిన వ్యక్తి కాకుంటే నలుగురు కూడా మిమ్మల్ని చూడటానికి రారు. కానీ ఒక సినిమా నటుడు చిన్న యాక్టర్ అయినా, పెద్ద యాక్టర్ అయినా వచ్చి నిలబడితే ప్రేక్షకులు అతడిని చూసేందుకు వస్తారు. మీకు ఓటేస్తారా..? లేదా..? అనేది తర్వాత విషయం. రాజకీయాల్లోని వ్యక్తులు మీ మాట వినేందుకు ప్రజలు రావాలని కోరుకుంటారు. కానీ ముందుగా ప్రజలు మిమ్మల్ని చూడటానికి రావాలి’’ అని జయా బచ్చన్ అన్నారు.