పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నాటు తుపాకీతో పట్టుబడ్డ ఇద్దరు ఆ కోవకు చెందిన వారేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మారణాయుధాలతో దొంగలు చోరీలకు పాల్పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.