- నా సస్పెండ్ పై ఇప్పటి వరకు బులిటెన్ ఇవ్వలేదు..
- తనను రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉందంటూ ఆగ్రహం..
- ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారని ప్రశ్నించిన మాజీంత్రి జగదీశ్ రెడ్డి..

Jagadish Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సస్పెండ్ పై బులెటిన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తనను రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ ఇస్తే నేను రాను.. ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేసారో అర్థం కావడం లేదు.. వారం నుంచి తనకు బులెటిన్ విడుదల చేయలేదు అని తెలిపారు. ఇక, ఇష్టారాజ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
Read Also: CSK vs MI: నా మైండ్ బ్లాక్ అయింది.. ఎంఎస్ ధోనీ సూపర్: రుతురాజ్ గైక్వాడ్
ఇక, నన్ను సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ రెండు సార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి రిక్వెస్ట్ చేశారు.. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అరచకత్వానికి పరాకాష్ట లాగా కనిపిస్తుంది.. రాజుల కాలంలో ఉన్నట్టు ఉంది తప్ప.. మంద బలంతో నడుపుతామంటే కుదరదు అని తెలిపారు. నాకు బులెటిన్ ఇవ్వాలి.. లేదంటే స్పీకర్ ను కలుస్తా.. రాతపూర్వకంగా నాకు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు.