Issues with e-pass system in Ooty and Kodaikanal.. Merchants’ bandh to cancel it..

Written by RAJU

Published on:

  • ఊటీ, కొడైకెనాల్‌లో ఈ-పాస్ ఇక్కట్లు..
  • రద్దు చేయాలని స్థానిక వ్యాపారుల డిమాండ్లు..
  • రద్దీని తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం..
  • కొత్త విధానం తెలియక ఏపీ, తెలంగాణ పర్యాటకుల ఇబ్బందులు..
Issues with e-pass system in Ooty and Kodaikanal.. Merchants’ bandh to cancel it..

Tamil Nadu: సమ్మర్ హాలిడేస్ రావడం, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఊటీ, కొడైకెనాల్ వెళ్తామనుకుంటున్న వారికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులకు ఈ -పాస్ విధానం గురించి తెలియక చిక్కుకుపోయారు. మరోవైపు, ఈ విధానంపై స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్

రోజుకు 4000 వాహనాలను మాత్రమే ఊట, కొడైకెనాల్‌లోకి అనుతిస్తున్నారు. శని, ఆదివారాల్లో 6 వేల పర్యాటక వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. కొత్తగా పెట్టిన ఈ-పాస్ విధానం గురించి తెలియక పర్యాటకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ విధానంపై స్థానిక వ్యాపారుల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల తమ వ్యాపారాలు నష్టపోతున్నాయని వాపోతున్నారు. ఈ- పాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీలగిరి జిల్లా అంతటా షాపుల మూసివేసి నిరసన తెలుపుతున్నారు.

ఈపాస్ విధానం వల్ల మా వ్యాపారాలుపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 12 డిమాండ్‌లతో షాపులను మూసివేశారు. రద్దీని తగ్గించేందుకు అధికారులు తీసుకున్న ఈ-పాస్ విధానంపై ఇప్పుడు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఊటి,కోడైకెనాల్ సహా జిల్లా మొత్తం దాదాపు 25 వేల షాపులు మూసివేశారు.

Subscribe for notification
Verified by MonsterInsights