Israeli tourist homestay owner gang raped in Karnataka

Written by RAJU

Published on:

  • ఉమెన్స్ డే రోజు దారుణం
  • ఇజ్రాయెల్ టూరిస్ట్‌, హోమ్ స్టే యజమానిపై గ్యాంగ్‌రేప్
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Israeli tourist homestay owner gang raped in Karnataka

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Bhupalpally: మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి సంచారం.. పాదముద్రలు గుర్తింపు

టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్‌ అనే ప్రాంతంలో తుంగభద్ర ఎడమ ఒడ్డున నక్షత్రాలను చూడటానికి ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఒకరు అమెరికన్, ఇంకొకరు ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ ఉన్నారు. గురువారం రాత్రి 11:30 గంటలకు కాలువ దగ్గర నక్షత్రాలను వీక్షిస్తుండగా.. దుండగులు బైక్‌పై వచ్చినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.

ఇది కూడా చదవండి: Women’s Day : మహిళ త్యాగం, ప్రేమ ఎనలేనివి..!

జరిగిన ఘోరంపై 29 ఏళ్ల హోమ్‌స్టే యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను.. మరో నలుగురు అతిథులతో కలిసి రాత్రి భోజనం తర్వాత తుంగభద్ర కాలువ చూసేందుకు వెళ్లామని.. కాలువ ఒడ్డున నక్షత్రాలు చూస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని.. అతిథులను కాలువలో తోసేశారని పేర్కొంది. అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ అనే అతిథులు బయటకు రాగలిగారని.. ఒడిశాకు చెందిన బిబాష్ జాడ మాత్రం కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: మోడీ కాన్వాయ్‌ రిహార్సల్ చేస్తుండగా బాలుడు సైక్లింగ్.. చితకబాదిన పోలీస్

నిందితులు.. మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని.. కొప్పల్ పోలీసు సూపరింటెండెంట్ అరసిద్ది తెలిపారు. ఇద్దరు మహిళలపై దాడి చేయడమే కాకుండా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో మహిళ పేర్కొన్నట్లు చెప్పారు. ప్రస్తుతం మహిళలు ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారని.. వారు కోరుకుంటే ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితులపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదు అందగానే వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నిందితులను గుర్తించామని.. రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. అత్యాచారం జరిగిందా? లేదా? అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక కాలువలో తప్పిపోయిన పర్యాటకుడి కోసం ఫైర్ సిబ్బంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Tamannaah : ప్రేమించే వ్యక్తిని జాగ్రత్తగా ఎంచుకోండి..

Subscribe for notification