- ప్రొఫెసర్ ప్రాణాలు కాపాడిన ‘కల్మా’ శ్లోకం
- బిగ్గరగా పఠించడంతో కుటుంబాన్ని వదిలిపెట్టిన ఉగ్రవాది

పహల్గామ్ భయానక ఘటన దేశ ప్రజలను హడలెత్తిస్తోంది. బాధిత కుటుంబాలకైతే ఇంకా కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఎవరిని కదిపినా.. భీతిల్లిపోతున్నారు. మంగళవారం జరిగిన మారణహోమం యావత్తు దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కళ్ల ముందే ఆప్తులను కోల్పోయిన దృశ్యాలు.. ఇంకా అందరి కళ్ల మెదలాడుతూనే ఉన్నాయి.
ప్రాణాలు కాపాడిన ‘కల్మా’ శ్లోకం
మంగళవారం బైసారన్ పచ్చిక బయళ్ల దగ్గర ఐదుగురు ఉగ్రవాదుల బృందం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ప్రతి ఒక్కరి మతం అడిగి.. పేరు అడిగి కాల్చి చంపేశారు. ఒకవేళ అబద్దం ఆడితే ప్యాంట్ ఇప్పించి చూశాక చంపేశారు. ఇలా దాడి చేస్తుండగా ఒక సమూహం ఇస్లామిక్ శ్లోకం ‘కల్మా’ పఠిస్తున్నారు. అక్కడే అస్సాం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దేబాసిష్ భట్టాచార్య ఉన్నారు. సిల్చార్‌లోని అస్సాం విశ్వవిద్యాలయంలో బెంగాలీ బోధిస్తారు. ఆయనకు ఇస్లామిక్ శ్లోకం కల్మా రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ శ్లోకాన్ని పఠించని వ్యక్తులను మాత్రం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు.
తన వంతు వచ్చినప్పుడు భట్టాచార్య బిగ్గరగా కల్మా శ్లోకాన్ని పఠించారు. దీంతో ఉగ్రవాదులు భట్టాచార్య కుటుంబాన్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశారు. అలా భట్టాచార్య కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఆ భయంకరమైన సంఘటనను తలుచుకుని దు:ఖ పర్యంతం అవుతున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి పట్టణానికి వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక భట్టాచార్య కుటుంబాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు అస్సాం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అస్సాం సీఎంవో ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Indus Water Treaty: పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.. ‘‘సింధు జలాల ఒప్పందం రద్దు’’.. అసలు ఏమిటీ ఒప్పందం..