
వేసవి సెలవులు సుదీర్గంగా ఉంటాయి. కనుక ఈ సెలవుల్లో తమ ఫ్యామిలీతో లేదా స్నేహితులతో కలిసి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణలో ఎంజాయ్ చేయాలనీ కోరుకుంటారు. అయితే తమ బడ్జెట్ లో కొత్త ప్రదేశాల్లో పర్యటించాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆంధ్రా ఊటీగా ప్రసిద్దిగాంచిన అరకు వ్యాలీ లో తక్కువ ధరకే పర్యటించేందుకు సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రకృతి ప్రేమికులకు నచ్చే పచ్చటి కొండలు, కదిలే మబ్బులు, చీకటి సొరంగాలు, చల్లని కాఫీ తోటలు అందమైన అనుభూతినిఇస్తాయి. అరకు ప్రయాణం ప్రతి ఒక్కరికీ మాధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ రోజు అరకు టూర్ ప్యాకేజీ వివరాలు గురించి తెలుసుకుందాం..
ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన వన్ డే టూర్ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్.. అనంతరం రోడ్ మార్గంలో అరకు ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను చుట్టేయండి. రోజూ ఉదయం 6:45 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్ నెం. 58501 అందుబాటులో ఉంది. ఈ ప్రయాణం వంతెనలు, కొండలు, పర్వతాలు, సొరంగాల మధ్య సాగుతూ.. ఉదయం సుమారు 11గంటలకు అరకు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
రైల్వే స్టేషన్ నుంచి ముందుగా ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం చేసి.. రోడ్డు మార్గంలో అరకు నుంచి విశాఖపట్నానికి తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించి.. తిరిగి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో అరకు టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ధరలు ఏమిటంటే
- కంఫర్ట్ కేటగిరీ పెద్దవారికి- రూ.3,010
- చిన్న పిల్లలకు – రూ.2,615
- స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు- రూ.2,125
- చిన్న పిల్లలకు రూ.1,730
- 2S రెండవ సీటింగ్లో పెద్దవారికి రూ.2,055
- పిల్లలకు రూ.1,655
ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు
- పర్యటనకు ట్రైన్ టికెట్లు,
- తిరుగు ప్రయాణంలో నాన్ ఏసీ బస్సు
- టిఫిన్
- లంచ్, టీ,
- బొర్రా గుహలకు ఎంట్రీ ఫీజు,
- ట్రావెల్ ఇన్సూరెన్స్
ఇప్పటికే పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన ఈ IRCTC ప్యాకేజీ ని బుక్ చేసుకోవాలనుకుంటే పూర్తి వివరాల కోసం.. IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. అరకు అందాలను ఒక్కరోజులోనే తక్కువ ధరలో వీక్షించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..