
భారతదేశంలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అంటే మందుగా గుర్తుకొచ్చేది గోవా.. తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకునే ప్లేస్. స్నేహితులతో మాత్రమే కాదు కుటుంబ సభ్యులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. నిత్యం దేశ, విదేశాల పర్యాటకులతో రద్దీతో కలకలాడుతుంది. ఈ ప్లేస్ వేసవిలో మరింత అందాలను సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. మీ బడ్జెట్‌లోనే ఈ ఐఆర్‌సీటీసీ గోవా డిలైట్ పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీ ని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గోవాకు సాగే ఈ టూర్ మొత్తం 3 రాత్రుళ్లు, 4 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ లో గోవాలోని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ నేపధ్యంలో ఈ స్పెషల్ టూర్ ప్రయాణం ఎప్పుడు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.
ప్రయాణ వివరాల్లోకి వెళ్తే
IRCTC అందిస్తున్న ఈ స్పెషల్ టూర్ ను గోవా డిలైట్” పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి దూరంగా ప్రసాంతంగా 4 రోజులపాటు గోవాలో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ మూడు రాత్రులు, నాలుగు పగళ్ళుతో ఈ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 20వ తేదీన అందుబాటులో ఉంది.
ఫస్ట్ డే: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విమానం (6E 362) ఉదయం 11 గం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12.30 గం. గోవా ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత.. హోటల్‌కు వెళ్తారు. చెకిన్ అయ్యి ఆ రోజు రాత్రికి డిన్నర్ చేసి విశ్రాంతి తీసుకోవాలి.
సెకండ్ డే: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దక్షిణ గోవా సైట్ సీయింగ్‌కు వెళ్తారు. ముఖ్యమైన ప్రదేశాలను చూస్తారు. ఓల్డ్ గోవా చర్చ్, వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరమ్మార్ బీచ్ ను సందర్శించాలి ఉంటుంది. అనంతరం ఒక గంట మాండోవి రివర్‌లో బోట్ క్రూయిజ్ రైడ్ ఉంటుంది. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుని అక్కడ డిన్నర్ చేసి రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
థర్డ్ డే: మూడో రోజు ఉదయం అల్పాహారం ముగించి తర్వాత ఉత్తర గోవాలో పర్యతించడానికి బయలుదేరాలి. ఇక్కడ ఉన్న అగ్వాడా కోట ను చూడాల్సి ఉంటుంది. కండోలిమ్ బీచ్, బాగా బీచ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. తరవాత వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటారు. తర్వాత అంజునా బీచ్, వాగాతర్ బీచ్, చప్రా ఫోర్ట్ సందర్శిచాల్సి ఉంటుంది. తిరిగి హోటల్‌కు చేరుకుని రాత్రి డిన్నర్ ముగించి రాత్రి హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.
నాలుగో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ముగించి హోటల్ చెక్ అవుట్ అయ్యి గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. మధ్యాహ్నం ఫ్లైట్ కి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవుతారు. సాయత్రం హైదరాబాద్ కు చేరుకోవడంతో ఈ గోవా డిలైట్ ముగుస్తుంది.
గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ధరల వివరాలు
- కంఫర్ట్ సింగిల్ షేరింగ్ రూ.24,485,
- డబుల్ ఆక్యూపెన్సీకి రూ.20, 000
- ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 19,625
- 5నుంచి 12 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.15,885,
- 5నుంచి 12 సంవత్సరాల పిల్లలకు విత్ అవుట్ బెడ్ రూ.15,510
- 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు రూ.8,450లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు
- ప్రయాణ భీమా సదుపాయం
- ఫ్లైట్ టికెట్లు.. (హైదరాబానుంచి గోవాకి తిరిగి గోవా నుంచి హైదరాబాద్)
- మూడు రాత్రులు హోటల్ లో బస చేసే సదుపాయం
- మూడు రోజుల బ్రేక్‌ఫాస్ట్
- మూడు రోజులు డిన్నర్
- టికెట్ బుకింగ్‌ను బట్టి సైట్ సీయింగ్ కోసం ఏసీ లేదా నాన్ ఏసీ వెహికల్
- ఆర్సీటీసీ ఎస్కార్ట్
ఈ ప్యాకేజీకి కింద మీరు గోవాలోని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ వేసవిలో గోవా టూర్ అసలు మిస్ చేసుకోండి.. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడే బుక్ చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..