IRCTC తత్కాల్‌ టికెట్ బుకింగ్‌ టైమింగ్స్ నిజంగా మారాయా? ఇండియన్‌ రైల్వే క్లారిటీ ఇదే..

Written by RAJU

Published on:

హైదరాబాద్, ఏప్రిల్ 11: నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆకరి నిమిషంలో రిజర్వేషన్‌ సీట్ల కోసం ప్రయత్నించేవారు తత్కాల్‌ ద్వారా అప్పటి కప్పుడు రైలులో సీట్లు రిజర్వు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై తాజాగా ఇండియన్‌ రైల్వే క్లారిటీ ఇచ్చింది. IRCTC తత్కాల్‌ టికెట్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు జరగలేదనీ పేర్కొంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ చేసే సమయం మారాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ఈ విధమైన నకిలీ వార్తలను నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ విధమైన పుకార్లను వ్యాప్తి చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని రైల్వే అథారిటీ హెచ్చరించింది. అసలేం జరిగిందంటే..

తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌ వేళలు ఏప్రిల్ 15 నుంచి మారతాయని, వీటికి వేర్వేరు సమయాలు ఇండియన్‌ రైల్వే కేటాయించినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఛానెళ్లలో వరుస పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. AC లేదా నాన్-AC తరగతులకు తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయాలలో ప్రస్తుతం అలాంటి మార్పులేవీ జరగలేదని, రైల్వే టిక్కెట్ల నిబంధనల గురించి పూర్తి సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే విశ్వసించాలని సూచించింది. ఈ మేరకు తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయాలు మారలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

భారతీయ రైల్వేల ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు తత్కాల్ టిక్కెట్లను రైల్వే స్టేషన్‌లలో లేదా ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాలు AC క్లాస్ (2A/3A/CC/EC/3E) తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌.. ప్రయాణానికి ముందు రోజు ఉదయం 10:00 గంటలకు తెరుచుకుంటుంది. నాన్-ఏసీ తరగతులకు తత్కాల్ టికెట్ బుకింగ్ (SL/FC/2S) ప్రయాణానికి ముందు రోజు ఉదయం 11:00 గంటలకు తెరుచుకుంటుంది. ప్రయాణికులు IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా తత్కాల్ ఇ-టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లభ్యతను బట్టి తత్కాల్ కోటాలో సీట్లను కేటాయిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights