హైదరాబాద్, మార్చి 23 : ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్స్ దందాపై రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా ఉప్పల్‌లో భారీగా బ్లాక్ టికెట్స్ దందా నడుస్తోంది. శని, ఆదివారాల్లో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 45 బ్లాక్ టికెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ముగ్గురిని, ఆదివారం 16 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. వారిలో నలుగురి నుంచి 15 టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.
అలాగే దేవేందర్ అగర్వాల్ నుంచి 2, గుగులోతు రాకేష్ నుంచి 4, భానోత్ యాకుబ్ నాయక్ నుంచి 2 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎల్బీనగర్ పోలీసులు చెప్పారు. ఇక కార్తీక అనే వ్యక్తి నుంచి 3, అప్పల సురేష్ దాస్ నుంచి 2 టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి పోలీసులు పేర్కొన్నారు. మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల విక్రయం జరగకుండా రాచకొండ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.
మరోవైపు కాసేపట్లో హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ కొట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల కోలాహలం ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియం పరిసరాలు ఆరెంజ్ రంగు సంతరించుకొంది.
ఇక ఐపీఎల్ 18వ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో మెదట మ్యాచ్ ప్రారంభంకానుంది. సొంత గడ్డపై ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడుతోన్నారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్ రైజర్స్‌కు మంచి రికార్డ్ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
IPL 2025: SRH vs RR మ్యాచ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్.. ఈ ఇద్దరూ యమ డేంజర్
For Telangana News And Telugu News
Updated Date – Mar 23 , 2025 | 02:50 PM