
ఇప్పుడంతా IPL సీజన్. క్రికెట్ అభిమానులంతా తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటున్నారు. తమ అభిమాన జట్టు గెలుపొందాలని, తమ అరాధ్య క్రికెటర్ ఎప్పటిలాగే రాణించాలని వివిధ రకాలుగా తమ ఎమోషన్స్‌ని వ్యక్తి పరుస్తుంటారు. అలాంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ RCB అభిమానులు కూడా వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. RCB ఫ్యాన్స్ కోసం ఇద్దరు బెంగళూరు ఆటో డ్రైవర్ల ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మీరు RCB అభిమానులైతే చాలు మీమ్మల్ని స్టేడియం వరకు ఉచితంగా దింపేస్తామంటూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అందుకు RCB జర్సీ ధరించాలనే కండిషన్ పెట్టారు. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగే ఉత్కంఠ భరితమైన పోరుకు ఈ ఆఫర్ ప్రకటించారు.
“RCB జెర్సీ ధరించినట్లయితే ఉచిత రైడ్” అని రాసి ఉన్న పెద్ద ప్లకార్డులను పట్టుకుని ఉచిత రైడ్‌లను ప్రకటించిందీ ఆటో డ్రైవర్స్ జంట. వారి ఫోటోలు ఇంటర్నెట్‌లో తుఫానుగా మారాయి. బెంగళూరుకు చెందిన ఇద్దరు ఆటోరిక్షా వాలాలు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు కన్నడ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ రాసిన బోర్డులను గర్వంగా పట్టుకుని ఉన్నట్లు చూపించాయి.
రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ మరియు ఇతరులను ఉత్సాహపరిచేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియంకు తరలివచ్చారు. అభిమానులు సులభంగా, ఉచితంగా స్టేడియం వద్దకు చేరుకునేందుకు ఇద్దరు ఆటో డ్రైవర్లు ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించడం పట్ల నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు మరియు క్రికెట్ ప్రేమికులు ఇద్దరు ఆటో డ్రైవర్లకు స్వదేశీ జట్టు పట్ల ఉన్న ప్రేమను మరియు తోటి RCB అభిమానుల పట్ల వారి మద్దతును ప్రశంసిస్తున్నారు.
వీడియో చూడండి: