- జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు
- టీ20 క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా
- రెండో భారత ఫాస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా

టీమిండియా స్టార్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో బుమ్రా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో అత్యంత వేగంగా 300 వికెట్స్ పడగొట్టిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. 237 ఇన్నింగ్స్‌లలో 300 వికెట్ల మార్కును అందుకున్నాడు.
Also Read: Ishan Kishan Match Fixing: మనోడు కాదు, పగోడు.. ఇషాన్ ఇంకా ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నాడు!
300 వికెట్స్ పడగొట్టిన రెండో భారత ఫాస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (318) ముందున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. యుజ్వేంద్ర చహల్ (373), పీయూష్ చావ్లా (319), భువనేశ్వర్ కుమార్ (318), రవిచంద్రన్ అశ్విన్ (315)లు బుమ్రా కంటే ముందున్నారు. మరోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ (170) రికార్డును బుమ్రా సమం చేశాడు. మరో వికెట్ పడగొడితే మలింగ రికార్డును బ్రేక్ చేస్తాడు.