IPL 2025, RR vs GT: Rahul Dravid’s notes on Vaibhav Suryavanshi

Written by RAJU

Published on:


  • మొదటి మ్యాచ్‌లోనే లక్నోపై 20 బంతుల్లో 34 రన్స్
  • రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై 12 బంతుల్లో 16 రన్స్
  • మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విధ్వంసకర శతకం
IPL 2025, RR vs GT: Rahul Dravid’s notes on Vaibhav Suryavanshi

ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కమ్ కెప్టెన్ సంజు శాంసన్‌కు గాయం కావడంతో వైభవ్‌కు తుది జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే లక్నోపై 20 బంతుల్లో 34 రన్స్ చేశాడు. రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై 12 బంతుల్లో 16 రన్స్ బాదాడు. ఇక మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విధ్వంసకర శతకం (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు) చేసి ఔరా అనిపించాడు. 35 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. గాయాన్ని మరిచిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు వైభవ్‌కు స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో ద్రవిడ్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైభవ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ద్రవిడ్ తన నోట్ బుక్స్‌లో ఏదో రాస్తూ కెమెరాకు చిక్కాడు. వైభవ్ బ్యాటింగ్‌ లోపాలను ది వాల్ నోట్ చేసుకుంటున్నాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘వైభవ్‌ హోంవర్క్‌ ద్రవిడ్ చేస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు.

Also Read: Vaibhav Suryavanshi: ఒక్క సెంచరీ.. 8 రికార్డులు!

బీహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. తాజ్‌పూర్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో వైభవ్ అభ్యసిస్తున్నాడు. క్రికెట్ కారణంగా చదవుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. టోర్నీలు లేని సమయంలో మాత్రమే అతడు స్కూల్‌కు వెళ్తాడు. అయితే సమయం దొరికినప్పుడు మాత్రం వైభవ్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడట. అటు క్రికెట్, ఇటు చదువును బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడట. వచ్చే ఏడాది వైభవ్ 10వ తరగతి చదవనున్నాడు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights