- పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్
- ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న లాకీ ఫెర్గూసన్
- ఫెర్గూసన్ స్థానంలో పంజాబ్ కింగ్స్‌కు మూడు ప్రత్యామ్నాయాలు

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు భారీ షాక్ తగిలింది. న్యూజీలాండ్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు తీవ్రమైన తొడ నొప్పితో మైదానాన్ని వీడాడు. ఫిజియోతో కలిసి మైదానాన్ని వీడిన ఫెర్గూసన్.. మరలా బౌలింగ్ చేయడానికి రాలేదు. ఫెర్గూసన్ లేని లోటు ఆ మ్యాచ్‌లో తీవ్ర ప్రభావం చూపింది.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధర!
లాకీ ఫెర్గూసన్ స్థానంలో పంజాబ్ కింగ్స్‌కు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కివీస్ యువ ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ ఫెర్గూసన్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను కూడా జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. భారత యువ ఫాస్ట్ బౌలర్ విజయ్ కుమార్ వైశాక్ కూడా ఫెర్గూసన్‌కు ప్రత్యామ్యాయంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 జీటీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ సీజన్లో రాణించిన ఫెర్గూసన్ జట్టుకు దూరమవడం పంజాబ్ కింగ్స్‌కు పెద్ద లోటే అని చెప్పాలి.
🚨 LOCKIE FERGUSON RULED OUT OF IPL 2025 DUE TO AN INJURY. 🚨 pic.twitter.com/emaOynwO16
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025