IPL 2025: KKR vs RCB Match Report – Thrilling Encounter in Kolkata

Written by RAJU

Published on:


  • కోల్‌కతాపై బెంగళూరు విజయం
  • 7 వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపు.
IPL 2025: KKR vs RCB Match Report – Thrilling Encounter in Kolkata

KKR vs RCB : ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీగా తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ జరగుతుందా లేదా అనే అనుమానాలు మొదట ఉత్కంఠ రేపాయి. అయితే, వరుణుడు సహకరించడంతో ఆట సజావుగా సాగింది. టాస్ గెలిచిన ఆర్సీబీ, మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్ క్వింటన్‌ డికాక్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ వేసిన ఐదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

అప్పటికే ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా జట్టును కెప్టెన్ అజింక్య రహానే, సునీల్ నరైన్ కలిసి ముందుకు నడిపించారు. తొలి మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు చేసిన కేకేఆర్, ఆ తర్వాత ఆరు ఓవర్లలో ఏకంగా 90 పరుగులు జత చేసింది. రహానే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తమ జట్టును మిడిలార్డర్ వరకు చక్కగా నడిపించాడు. పది ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ 100 పరుగుల మార్కును దాటింది.

అయితే, భారీ స్కోర్ దిశగా సాగుతున్న కేకేఆర్‌పై ఆర్సీబీ బౌలర్లు తిరుగు దాడి చేశారు. వరుసగా కీలక వికెట్లను కోల్పోవడంతో కోల్‌కతా జట్టు స్వల్ప వ్యవధిలోనే కోలుకోలేని దశకు చేరుకుంది. మిడిలార్డర్ ఆటగాళ్లు రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ కూడా ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దీంతో, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేకేఆర్ 174 పరుగులకే పరిమితమైంది.

175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. క్రీజ్‌లోకి ఎంట్రీ అయిన విరాట్ కోహ్లీ, ఫిల్‌ సాల్ట్‌ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడిన ఈ జోడీ, కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడి చేసింది. సాల్ట్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కోహ్లీ కూడా అర్ధ శతకంతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేకేఆర్ బౌలింగ్ విభాగం కట్టుదిట్టమైన ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేసినప్పటికీ, విరాట్, సాల్ట్ జోడీ వారి అంచనాలను తలకిందులు చేసింది. పటిష్ఠమైన స్ట్రోక్ ప్లే ద్వారా ఆర్సీబీ విజయం దిశగా సాగింది. చివరకు, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించి, తమ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.

Pooja Hegde : సినిమాల్లో హీరోయిన్లపై వివక్ష ఉంది.. పూజాహెగ్దే సంచలన కామెంట్స్

Subscribe for notification