- టీమిండియా యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు
- మూడు ఫార్మాట్‌లలోనూ కీలక ఆటగాడిగా గిల్
- ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా ఫ్యాన్స్ ఆసక్తి
- ఐపీఎల్ 2025లో పెళ్లి అప్‌డేట్ ఇచ్చిన శుభ్‌మన్ గిల్!

టీమిండియా యువ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. 25 ఏళ్ల గిల్ తన అద్భుత ఆటతో భారత జట్టులో సుస్థిర స్థానం సంపాధించాడు. టెస్ట్, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్‌లలోనూ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తనదైన సారథ్యంతో ఐపీఎల్ 2025లో గుజరాత్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో గిల్ ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా గిల్ తన పెళ్లి గురించి అప్‌డేట్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ టాస్ సందర్బంగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. పెళ్లి బాజాలు ఎప్పుడు?. ఇంతకీ ఏం జరుగుతోంది?. త్వరలోనే పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. ఈ ప్రశ్నకు ముందుగా షాక్ అయిన గిల్.. అలాంటిదేమీ లేదు అని నవ్వుతూ బదులిచ్చాడు. మొత్తంగా ఇప్పుట్లో తాను పెళ్లి చేసుకోను అని పంజాబ్ కుర్రాడు స్పష్టం చేశాడు.
Also Read: AP SSC Results 2025: రేపు పదో తరగతి ఫలితాలు విడుదల.. వాట్సప్‌లోనూ రిజల్ట్స్!
గత కొంత కాలంగా శుభ్‌మన్ గిల్ డేటింగ్‌పై రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు కలిసి బయట కనిపించడం, గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా అటెండ్ కావడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్స్ చేసుకోవడం లాంటివి డేటింగ్ రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. మరోవైపు బాలీవుడ్ భామలు సారా అలీఖాన్, రిద్ధిమా పండిట్, అవనీత్ కౌర్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.