IPL 2025 Factors Desk: LSG vs PBKS మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

Written by RAJU

Published on:


IPL 2025 Points Table, Top 5 Batters and Bowlers: ఐపీఎల్ 2025లో భాగంగా 13వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు లక్నో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి బలమైన జట్టును ఓడించిన తర్వాత, లక్నో జట్టు తన విజయ పరంపరను కొనసాగిస్తుందని భావించారు. కానీ, పంజాబ్‌పై లక్నో ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

టాస్ ఓడిన తర్వాత, లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నికోలస్ పూరన్ 44 పరుగుల సహాయంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రబ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ సహాయంతో 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరిగాయో, ప్రస్తుత సీజన్‌లో టాప్ 5 బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2025 13వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..

1) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 2.266)

2) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.485)

3) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓటమి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.132)

4) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 1, ఓడినది – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.625)

5) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.309)

6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.150)

7) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.771)

8) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.871)

9) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.112)

10) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.428)

IPL 2025 లో టాప్ 5 బ్యాట్స్ మెన్లు..

1. నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) – 3 మ్యాచ్‌లు, 189 పరుగులు

2. శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్) – 2 మ్యాచ్‌లు, 149 పరుగులు

3. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 2 మ్యాచ్‌లు, 137 పరుగులు

4 . ట్రావిస్ హెడ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 3 మ్యాచ్‌లు, 136 పరుగులు

5. మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్) – 3 మ్యాచ్‌లు, 124 పరుగులు

IPL 2025 లో టాప్ 5 బౌలర్లు..

1. నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్) – 3 మ్యాచ్‌లు, 9 వికెట్లు

2. మిచెల్ స్టార్క్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 2 మ్యాచ్‌లు, 8 వికెట్లు

3. శార్దూల్ ఠాకూర్ (లక్నో సూపర్ జెయింట్స్) – 3 మ్యాచ్‌లు, 6 వికెట్లు

4. ఖలీల్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్) – 3 మ్యాచ్‌లు, 6 వికెట్లు

5 . కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 2 మ్యాచ్‌లు, 5 వికెట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights