IPL 2025 Factors Desk: చారిత్రాత్మక విజయం.. కట్‌చేస్తే.. పాయింట్స్ టేబుల్‌కు పిచ్చెక్కించిన పంజాబ్

Written by RAJU

Published on:


Indian Premier League 2025 Points Table Update After KKR vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా 31వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 16 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు కేవలం 111 పరుగులు చేసి, దానిని కాపాడుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 95 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విధంగా పంజాబ్ ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరును కాపాడుకుంది. ఈ ఫలితంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో శ్రేయాస్ జట్టుకు కూడా ప్రయోజనం చేకూర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పంజాబ్ జట్టు ఆరో స్థానం నుంచి నాల్గవ స్థానానికి అంటే రెండు స్థానాలు ఎగబాకింది. అదే సమయంలో, అజింక్య రహానె నాయకత్వంలోని కోల్‌కతా రైడర్స్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక..

జట్టుమ్యాచ్‌లుగెలిచిందిఓటమినెట్ రన్ రేట్పాయింట్లు
1. గుజరాత్ టైటాన్స్6421.0818
2. ఢిల్లీ క్యాపిటల్స్541. 1.0.8998
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు6420.6728
4. పంజాబ్ కింగ్స్6420.1728
5. లక్నో సూపర్ జెయింట్స్7330.0868
6. కోల్‌కతా నైట్ రైడర్స్7330.5476
7. ముంబై ఇండియన్స్6240.104 4
8. రాజస్థాన్ రాయల్స్624-0.8384
9. సన్‌రైజర్స్ హైదరాబాద్624-1.2454
10. చెన్నై సూపర్ కింగ్స్725-1.2764

111 పరుగులకే పంజాబ్ ఆలౌట్..

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (15 బంతుల్లో 30), ప్రియాంష్ ఆర్య (12 బంతుల్లో 22) కలిసి తొలి వికెట్‌కు 20 బంతుల్లో 39 పరుగులు జోడించి పంజాబ్‌కు బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. కానీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా (3/25, 3 ఓవర్లు) కేకేఆర్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. తన మొదటి ఓవర్‌లోనే, శ్రేయాస్ అయ్యర్, ప్రియాంష్ ఆర్యల విలువైన వికెట్లను రాణా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి జోష్ ఇంగ్లిస్‌ను లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రాన్‌ను కూడా రాణా 30 (15) పరుగులకే ముగించాడు. దీంతో పంజాబ్ ఆరు ఓవర్ల తర్వాత 54/4తో కష్టాల్లో పడింది. పవర్‌ప్లే తర్వాత కూడా, నరైన్, చక్రవర్తి (2/21) స్పిన్‌తో పంజాబ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. పంజాబ్ కేవలం 111 పరుగులకే పరిమితం కాగా, అన్రిచ్ నార్ట్జే (1/23), వైభవ్ అరోరా (2.2 ఓవర్లలో 1/26) ఇద్దరూ ఒక వికెట్ చొప్పున అందించారు.

పంజాబ్ చారిత్రాత్మక విజయం..

ఇక ఛేజింగ్‌లో కో‌ల్‌కతా కూడా ఇబ్బందులు పడింది. ఓపెనర్లిద్దరూ 7 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే, కెప్టెన్ అజింక్య రహానే, యువ అంగ్క్రిష్ రఘువంశీల మధ్య 55 పరుగుల భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువ చేసేలా ఆశలు కల్పించింది. అయితే, తన అద్భుతమైన పునరాగమనంతో జట్టును ఆశ్చర్యపరిచిన యూజీ.. తన నాలుగు ఓవర్లలో 4/28 గణాంకాలతో ముగించాడు. పంజాబ్ బంతితో తిరిగి రావడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. 9.1 ఓవర్లలో 72/4 నుంచి 15.1 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌట్ అయ్యేలా దారి తీసింది.

బ్యాటింగ్ వైఫల్యం తర్వాత అందరూ పంజాబ్‌ ఓడిపోతుందని అంతా భావించారు. కానీ, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న చాహల్.. బంతితో తిరిగి రావడంతో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights