ఐపీఎల్ 2025 సీజన్ కోసం సర్వం సిద్ధమైంది. అన్ని టీమ్స్ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. మెగా వేలం తర్వాత అన్ని టీమ్స్ కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. కొన్ని జట్లు తమ కోర్ టీమ్‌ను కొనసాగిస్తే.. చాలా టీమ్స్ తమ స్క్వౌడ్‌ను పూర్తిగా మార్చుకొని బరిలోకి దిగుతున్నాయి. మిగతా అన్ని టీమ్స్ పరిస్థితి ఎలా ఉన్నా.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ గురించి మాట్లాడుకోవాలి. గత 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్స్ కోసం యుద్ధం చేస్తున్న జట్లలో ఢిల్లీ కూడా ఒకటి. ఎప్పుడూ పెద్దగా హడావిడి లేకుండా తమ శక్తిమేరా ఇంప్యాక్ట్ చూపిస్తూ ఉంటుంది.
కానీ, ఈ సారి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ప్రతి సీజన్‌లో కప్పు కొట్టాలనే కదా అనుకుంటుంది అనుకోవచ్చు.. బట్ ఈ సారి టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఉన్న స్క్వౌడ్‌తో అద్బుతమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను పిక్ చేసుకుంటే.. డీసీ ఒక పవర్ ఫుల్ టీమ్‌గా మారొచ్చు. మరి ఆ జట్లులో ఎలాంటి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల బలం ఏంటి? బలహీతలేంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఐపీఎల్ మెగా వేలం తర్వాత ఢిల్లీకి కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. డీసీ మేనేజ్‌మెంట్ కూడా కేఎల్‌కే ముందుగా కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ, వారి ఆఫర్‌ను కేఎల్ సున్నితంగా తిరస్కరించాడు.
దీంతో.. డీసీకి ఎంతో నమ్మిన బంటులా ఉన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అదే మన బాపుకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది డీసీ మేనేజ్‌మెంట్. ఇది ఒక మంచి డిసిషన్‌గా చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఐపీఎల్‌లో పంజాబ్, లక్నో టీమ్స్‌కు కెప్టెన్‌గా చేశాడు. కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేసినా.. కప్పులు మాత్రం సాధించలేకపోయాడు. దీంతో మళ్లీ ఒక కొత్త టీమ్‌కు కెప్టెన్‌గా హై ఎక్స్‌పెట్టేషన్స్‌తో బరిలోకి దిగే బదులు.. ఏ మాత్రం అంచనాలు లేని ఓ ప్లేయర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే, కేఎల్ ప్రశాంతంగా తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టుకోవచ్చు. కేఎల్ బ్యాటింగ్‌లో క్లిక్ అయ్యాడా.. ఇక ఢిల్లీ సీజన్ మొత్తం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
ఇక ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే.. ఓపెనర్‌గా ఆస్ట్రేలియా యువ చిచ్చర పిడుగు, అసలు భయమంటే ఏంటో తెలియకుండా ఆడే జెక్ ఫ్రెజర్ ఉండనే ఉన్నాడు. అతనికి జోడీగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. లేదా వాళ్ల వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అయినా ఓపెనర్‌గా ఆడొచ్చు. కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, ట్రిస్టన్ స్టబ్స్‌తో వాళ్లు మిడిల్డార్ సూపర్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లలో ఎలాగో కెప్టెన్ సాబ్ అక్షర్ పటేల్ ఉన్నాడు. అలాగే సమీర్ రిజ్వీ కూడా ప్లేయింగ్‌లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే అశుతోష్ శర్మ ఉన్నాడు. కెప్టెన్‌తో పాటు ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు ప్లేయింగ్‌లో ఉంటారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియన్ మిషన్ గన్ మిచెల్ స్టార్క్, ఇండియన్ యార్కర్ కింగ్ టీ నటరాజన్‌తో పాటు ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత్ చమీరా ఉన్నారు.
స్పిన్ విషయానికి వస్తే.. చైనామెన్ బౌలర్ మన కుల్దీప్ యాదవ్ వాళ్లకు బిగ్గెస్ట్ అసెట్. అలాగే కెప్టెన్ అక్షర్ కూడా స్పిన్నరే. సో.. ఎలా చూసుకున్న ఢిల్లీకి ఒక డీసెంట్ స్క్వౌడ్ కుదిరింది. సరిగ్గా ప్లేయింగ్ ఎలెవన్ ప్లాన్ చేసుకుంటే.. ఈ సీజన్‌లో సైలెంట్ కిల్లర్స్‌లా మారి.. ట్రోఫీని ఎగరేసుకుపోయినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాపు కెప్టెన్సీలో దేశరాజధానికి తొలి ఐపీఎల్ ట్రోఫీ దగ్గ సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా వారి బెస్ట్ ప్లేయింగ్ ఎలా ఉంటుందో అని చూస్తే.. జెక్ ఫ్రెజర్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.