యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఐపీఎల్. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్స్‌కి ఊతం ఇస్తోంది. గతేడాది హైదరాబాద్ జట్టు ద్వారా నితీష్ కుమార్ రెడ్డి లైమ్ లైట్‌లోకి రాగా.. ఇప్పుడు అనికేత్ వర్మ SRHకి ట్రంప్ కార్డుగా మారాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు నిండిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అనికేత్ వర్మ.. తాను ఆడిన మూడో మ్యాచ్‌లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు.
మార్చి 30న ఆదివారం విశాఖపట్నంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. కేవలం 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును.. 23 ఏళ్ల అనికేత్ వర్మ ముందుంది నడిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.
అనికేత్ అద్భుతమైన అర్ధ సెంచరీ..
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ 36 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఢిల్లీపై అతడు కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది ఐపీఎల్‌లో అనికేత్ తొలి అర్ధ సెంచరీ. తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే 16వ ఓవర్లో మెక్‌గర్క్ అద్భుతమైన క్యాచ్ తీసుకొని అనికేత్‌ను పెవిలియన్ పంపాడు. అనికేత్ మొత్తంగా 41 బంతులు ఎదుర్కుని 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.
Showed what dreams are made of 🫶
Aniket Verma | #PlayWithFire | #DCvSRH | #TATAIPL2025 pic.twitter.com/JcNrsuZ1NX
— SunRisers Hyderabad (@SunRisers) March 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..