దేశ దిశ

IPL 2025: 40 మ్యాచ్‌లలో 111 క్యాచ్‌లు.. SRH కాదు ఐపీఎల్‌లో వరస్ట్ టీం ఇదే.!


IPL 2025: 40 మ్యాచ్‌లలో 111 క్యాచ్‌లు.. SRH కాదు ఐపీఎల్‌లో వరస్ట్ టీం ఇదే.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో క్యాచ్‌లు వదులుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఇక్కడ 10 జట్లు కలిసి ఇప్పటివరకు 111 క్యాచ్‌లను వదులుకున్నాయి. అంటే ప్రతి మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లకు.. ఒక క్యాచ్ మిస్ చేశారు. ఇది గత ఐదు సంవత్సరాలలో అత్యంత చెత్త రికార్డు. ఈ సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ నంబర్ 1 స్థానంలో ఉంది.

అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన జట్టు..

అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటివరకు 64.3% క్యాచ్‌లు మాత్రమే తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ క్యాచింగ్ సామర్థ్యం 70.5% మాత్రమే. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ క్యాచింగ్ సామర్థ్యం 71.4%. లక్నో క్యాచింగ్ సామర్థ్యం 73.9 శాతంగా ఉంది. ఇక పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ క్యాచింగ్ సామర్థ్యం 77.4 శాతం మాత్రమే. ఇంత పెద్ద స్థాయి టోర్నమెంట్‌లో ఎన్ని క్యాచ్‌లు మిస్ అవుతున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

Exit mobile version