దేశ దిశ

IPL 2025: 4 క్యాచ్‌లు వదిలేశావ్.. రూ.14 కోట్లతో జల్సాలు చేస్తున్నావ్.. నీ లైఫ్ బిందాస్ భయ్యా

IPL 2025: 4 క్యాచ్‌లు వదిలేశావ్.. రూ.14 కోట్లతో జల్సాలు చేస్తున్నావ్.. నీ లైఫ్ బిందాస్ భయ్యా


Riyan Parag Drop 4 Catches: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు, ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 8వ స్థానంలో ఉంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, రియాన్ పరాగ్ జట్టును నడిపిస్తున్నాడు. కానీ, ఈ ఆటగాడు తన ప్రదర్శనతో తన సహచరుల మనోధైర్యాన్ని తగ్గిస్తున్నాడు. ఈ సీజన్‌లో రియాన్ పరాగ్ చాలా సందర్భాల్లో క్యాచ్‌లను వదిలేశాడు. ఇది జట్టుకు చాలా హానికరమని నిరూపితమైంది. ఈ సీజన్‌లో రియాన్ పరాగ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను ఇంకా తనను తాను నిరూపించుకోలేకపోయాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా రూ. 14 కోట్లు దక్కించుకుని జాల్సాలు చేస్తున్నావ్ భయ్యా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

సాల్ట్ క్యాచ్‌ను మిస్ చేసిన రియాన్ పరాగ్..

ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీతో జరిగిన 42వ మ్యాచ్‌లో, రియాన్ పరాగ్ మర్చిపోలేని తప్పు చేశాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ రెండవ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతికి ఫరూఖీ ఫుల్ టాస్ వేశాడు. ఆర్‌సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ షాట్ ఆడటానికి వెళ్ళాడు. కానీ, బంతి మిడ్-ఆఫ్ వైపు వెళ్లింది. అక్కడే ఉన్న రియాన్ పరాగ్ క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి అతని చేతిలోంచి జారిపోయింది. ఆ సమయంలో సాల్ట్ 1 పరుగుతో ఉన్నాడు. ఆ తరువాత, సాల్ట్ 23 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, విరాట్ కోహ్లీతో కలిసి 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ సీజన్‌లో 4 క్యాచ్‌లు వదిలేసిన రియాన్ పరాగ్..

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 క్యాచ్‌లు పట్టాడు. అలాగే, 4 క్యాచ్‌లను వదిలేశాడు. కెప్టెన్ ఇలా క్యాచ్‌లు వదులుకోవడం జట్టుకు ప్రమాదకరమని నిరూపితమవుతోంది. ఈ సీజన్‌లో అతని ప్రదర్శన గురించి చెప్పాలంటే, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌కు ముందు, అతను 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 30.28 సగటుతో 212 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 ఓడిపోచింది. 2 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version