IPL 2025: సీఎస్‌కేను భయపెట్టిన ఆటో డ్రైవర్‌ కొడుకు! పేదరికాన్ని జయించి.. ముంబై ఇండియన్స్‌ పరువు నిలిపాడు!

Written by RAJU

Published on:


ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో హోం టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఐపీఎల్‌లోనే మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న ఈ రెండు టీమ్స్‌ మధ్య మ్యాచ్‌ కావడంతో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తి చూపించారు. అనుకున్నట్లే.. ఈ రెండు టీమ్స్‌ మధ్య మ్యాచ్‌ థ్రిల్లింగ్‌గా సాగింది. ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ డకౌట్‌ అయి అందర్ని నిరాశపర్చాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌ పిచ్‌పై సీఎస్‌కే స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా ఆఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ ముంబైని కుప్పకూల్చాడు. అతని దెబ్బకు ఎంఐ కేవలం 155 పరుగులకే పరిమితమైంది. 4 ఓవర్లలో కేవలం 18 రన్స్‌ మాత్రమే ఇచ్చిన నూర్‌ 4 కీలక వికెట్లు తీసుకొని.. మ్యాచ్‌ టర్నింగ్‌ మ్యాన్‌గా మారాడు.

ఐపీఎల్‌ మెగా వేలంలో సీఎస్‌కే అతనిపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే.. కేవలం 156 పరుగుల టార్గెట్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ చాలా ఈజీగా ఛేజ్‌ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆరంభంలోనే ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి 2 పరుగులు చేసి అవుటైనా.. మరో ఓపెనర్‌ రచిన్‌ రవీంద్రా, కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీలో రాణించి.. ఛేజ్‌ను ఈజీ చేసినా.. ఓ యువ బౌలర్‌ మాత్రం సీఎస్‌కేను భయపెట్టాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ.. అది కూడా ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడుతూ.. తన సత్తా ఏంటో చూపించాడు. ఒకొనొక దశలో మ్యాచ్‌ను టైట్‌ చేసి పడేశాడు. కంఫర్ట్‌బుల్‌గా ఉన్న సీఎస్‌కేను ఒత్తిడిలోకి నెట్టిన ఆ యువ బౌలర్‌ పేరు విగ్నేష్‌ పుతుర్‌. తన సూపర్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తో 7.4 ఓవర్లకు ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి.. మంచి పొజిషన్‌లో ఉన్న సీఎస్‌కేను.. తన మూడు ఓవర్లు పూర్తి అయ్యే లోపు 107కు నాలుగు వికెట్లు కోల్పోయేలా చేసి.. ఒక్కసారిగా ముంబై ఇండియన్స్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొని మంచి జోష్‌లో ఉన్న రుతురాజ్‌ను ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ 5వ బంతికి అవుట్‌ చేశాడు. ఆ వెంటనే 10వ ఓవర్‌లో డేంజరస్‌ శివమ్‌ దూబెను, 12వ ఓవర్‌లో దీపక్‌ హుడాను పెవిలియన్‌కు పంపాడు. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు సాధించాడు. అతని దెబ్బకు సీఎస్‌కే ఒక్కసారిగా డిఫెన్సివ్‌ మూడ్‌లోకి వెళ్లిపోయింది. అయితే టార్గెట్‌ మరీ చిన్నిది కావడంతో పుతుర్‌ ఇచ్చిన షాక్‌ను తట్టుకొని ఎలాగోలా టార్గెట్‌ను చేరుకుంది చెన్నై. వాళ్లు మ్యాచ్‌ గెలిచినప్పటికీ.. విగ్నేష్‌ పుతుర్‌ హృదయాలను గెల్చుకున్నాడు. సీఎస్‌కే మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌, తలా ధోని కూడా అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఇంతకీ ఈ పుతుర్‌ ఎక్కడి వాడో తెలుసా? కేరళా రాష్ట్రం మలప్పురానికి చెందిన క్రికెటర్‌. ఇంకా కేరళా స్టేట్‌ టీమ్‌కు ఆడకపోయినా.. అండర్‌ 14, అండర్‌ 19లో సత్తా చాటి.. ముంబై ఇండియన్స్‌ టాలెంట్‌ హంట్‌ దృష్టిని ఆకర్షించాడు.

దాంతో ఐపీఎల్‌ మెగా వేలంలో పుతుర్‌ను కేవలం రూ.30 లక్షలకే ముంబై సొంతం చేసుకుంది. కోట్లు పెట్టి కొన్న బౌలర్లు విఫలం అవుతున్నా.. పుతుర్‌ మాత్రం కేవలం రూ.30 లక్షలకే అప్పనంగా దొరికి.. తొలి మ్యాచ్‌లోనే ముంబైకి మూడు వికెట్లు అందించాడు. నిజానికి విఘ్నేష్ పుతూర్ స్టార్టింగ్‌లో మీడియం పేస్‌ బౌలింగ్‌ చేసేవాడు. కానీ, అతనిలో తెలియన్‌ టాలెంట్‌ ఉందని గుర్తించిన స్థానిక క్రికెటర్ మహమ్మద్ షెరీఫ్ లెగ్ స్పిన్ ప్రయత్నించమని సూచించాడు. దాంతో పుతుర్‌ స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. రిస్ట్‌ స్పిన్‌ అద్బుతంగా చేసేవాడు. అప్పటికీ చైనామాన్ బౌలర్‌ అంటే ఏంటో కూడా అతనికి తెలియదు, కానీ పట్టువదలకుండా అతను స్పిన్‌ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేసి.. మంచి రిస్ట్‌ స్పిన్నర్‌గా మారిపోయాడు. క్రికెట్ కెరీర్‌ను కొనసాగించడానికి త్రిస్సూర్‌కు వెళ్లి సెయింట్ థామస్ కాలేజ్ తరపున ఆడుతూ.. కేరళ కాలేజ్ ప్రీమియర్ టీ20 లీగ్‌లో ఆడే అవకాశం అందుకున్నాడు.

ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఆడాడు. ఈ కుర్రాడు టాలెంట్‌ను గుర్తించిన ముంబై ఇతన్ని సౌతాఫ్రికాకు పంపించి మంచి ట్రైనింగ్‌ కూడా ఇప్పించింది. మరో విషయం ఏంటంటే.. పుతుర్‌ చాలా పూర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ల నాన్న ఓ ఆటో డ్రైవర్‌. ఆయన కష్టంతోనే ఇళ్లు గడిచేది. పుతుర్‌ టాలెంట్‌ను గుర్తించి అతన్ని క్రికెట్‌ వైపు ప్రొత్సహించారు ఆయన. మన హైదరాబాదీ సిరాజ్‌ వాళ్ల నాన్న కూడా ఆటో డ్రైవర్‌ అనే విషయం తెలిసిందే. ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా.. క్రికెట్‌పై ఉన్న కసితో వీళ్లంతా ఈ స్థాయికి చేరుకున్నారు.. కొన్ని కోట్ల మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన పుతుర్‌.. రానున్న మ్యాచ్‌ల్లో మరింతగా చెలరేగి, త్వరలోనే ఇండియాకు ఆడాలని కోరుకుందాం.. ఆల్‌ ది బెస్ట్‌ టూ విగ్నేష్‌ పుతుర్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification