హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మధ్య టికెట్ల వివాదం నేపథ్యంలో SRHకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. SRHను ఏపీకి రావాలని ఆహ్వానించింది. మిగిలిన మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించాలని కోరింది. సన్‌రైజర్స్ ఏపీకి వస్తే… పన్ను మినహాయింపుతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని ఆంధ్ర క్రికెట్ బోర్డు వెల్లడించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్… గత సీజన్‌లో ఐపీఎల్ రికార్డులను బద్దల కొట్టిన టీమ్…ఇక 2025లోకి అడుగుపెట్టిందో లేదో…మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో టీమ్‌గా నిలిచింది. గత సీజన్‌లో తమ ఆట తీరుతో భారీగా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో ఈసీజన్‌లో హైదరాబాద్‌లో జరిగే SRH మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో SRH మ్యాచ్ టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, SRH యాజమాన్యానికి మధ్య వివాదం నెలకొంది. తమకు ఇచ్చే టికెట్ల కంటే HCA అదనంగా టికెట్లు అడుగుతోందని..SRH యాజమాన్యం ఆరోపిస్తోంది. HCA తన తీరును మార్చోకోకుండా.. టికెట్ల తమను బలవంత పెడితే…హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని SRH యాజమాన్యం తేల్చి చెప్పింది. అటు HCA మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేస్తోంది. టికెట్ల కోసం తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని చెప్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇరు యాజమాన్యాల మధ్య సయోద్యను కుదుర్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..