IPL 2025: వేలం తర్వాత.. వాళ్లు నాతో ఒకే మాట చెప్పారు! SRH సక్సెస్‌ సీక్రెట్‌ను బయటపెట్టిన ఇషాన్‌ కిషన్‌

Written by RAJU

Published on:


ఆదివారం కాటేరమ్మ కొడుకులు ఊచకోత కోశారు. ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభమైన రెండో రోజే టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ కొట్టేశారు. ఫస్ట్‌ కొట్టింది కూడా వీళ్లే అనుకోండి. అది వేరే విషయం. కానీ, ఫస్ట్‌ మ్యాచ్‌లోనే ఈ రేంజ్‌ విధ్వంసం చూసి మిగతా టీమ్స్‌ భయపడుతున్నాయి. 2024లో ఎలాంటి బ్యాటింగ్‌ చేసిందో.. ఈ సీజన్‌లో అక్కడి నుంచే మొదలుపెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్‌. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. లాస్ట్‌ సీజన్‌లో 287 పరుగుల అత్యధిక స్కోర్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ పేరు మీదే ఉంది. అయితే ఆరెంజ్‌ ఆర్మీ ఇంత భారీ స్కోర్‌ చేయడంలో కొత్త టీమ్‌ మెంబర్‌, ప్యాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ రోల్‌ చాలా ఉంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ.. సూపర్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. ఊచకోత కోయడమే ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సులతో 106 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కొన్ని కారణాల వల్ల టీమిండియాలో చోటు, బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొగొట్టుకున్న ఇషాన్‌.. మళ్లీ టీమిండియాలో చోటే లక్ష్యంగా క్రికెట్‌ మొదలుపెట్టాడు. అందుకే ఎస్‌ఆర్‌హెచ్‌ అతనికి సూపర్‌ ప్లాట్‌ఫామ్‌ను సెట్‌ చేసి పెట్టింది. ఫీయర్‌ లెస్‌ అగ్రెసివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆడమని.. అతని లైసెన్స్‌ ఇచ్చేసింది. దాంతో ఫస్ట్‌ మ్యాచ్‌లోనే తానేం చేయగలడో చూపించాడు.

అయితే వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇషాన్‌ను తీసుకున్న వెంటనే.. అతను ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు కాల్‌ చేశాడంట. నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రతి బాల్‌ను బాదేయాలా? అని అభిషేక్‌ను అడగడంతో.. ఎస్‌.. కచ్చితంగా నువ్వు అదే చేయాలని అభిషేక్‌ చెప్పినట్లు ఇషాన్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌లో తన రోల్‌ ఏంటో ఇషాన్‌కు క్లియర్‌గా తెలిసిపోయింది. అలాగే టీమ్‌లో జాయిన్‌ అయిన తర్వాత కెప్టెన్‌ కమిన్స్‌ సైతం ఇషాన్‌కు ఫ్రీహ్యాండ్‌ ఇచ్చి, ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడమని చెప్పేశాడు. ఆ ఒక్క మాట.. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే ఇషాన్‌ చేత సెంచరీ కొట్టించిందన్న మాట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification